ఈ మధ్య కాలంలో చాలా మంది మళ్లీ వ్యవసాయం మీద ఆసక్తి చూపుతున్నారు. అలానే చాలా మంది ఉద్యోగాల కంటే కూడా సొంతంగా వ్యాపారాలు చేసుకోవడానికి చూస్తున్నారు మీరు కూడా సొంతంగా ఏదైనా చేయాలని అనుకుంటే ఈ రైతు ని స్ఫూర్తిగా తీసుకోండి అప్పుడు కచ్చితంగా మీరు కూడా ఉన్నత స్థాయికి చేరుకోగలరు.
అవకాడో, డ్రాగన్ ఫ్రూట్స్ వంటి వాటిని రైతులు పండిస్తున్నారు. ఇటువంటి వాటికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువ వుంది. ఒక్కో పండు 30 రూపాయల నుండి దాకా ఉంటుంది. కేజీ 100 చప్పున రైతులు అమ్ముతున్నారు. అవకాడో సాగు ద్వారా ఈ రైతు కూడా చక్కటి లాభాలని పొందుతున్నారు. అవకాడో చెట్టు నుండి సీజన్ కి 100 నుండి 500 పండ్లు వరకు కాస్త కాస్తాయి. సెప్టెంబర్, అక్టోబర్ సమయంలో పండ్లు చేతికి వస్తాయి.
జింక్ యూరియా వంటి ఎరువులని ఈ పండ్ల కోసం ఉపయోగించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని లంబసింగి కి చెందిన గంగాధర్ పది ఎకరాల పొలంలో మూడు ఎకరాల అవకాడో సాగును చేపట్టగా అంతర పంటగా పైనాపిల్, అల్లం, పసుపు వంటివి పండించారు అవకాడో కోసం అదనంగా ఎరువులు ఏమి కొనలేదు. కంపోస్ట్, వర్మీ కంపోస్ట్ వంటివి ఉపయోగించేవారు.
ఎకరానికి మూడు లక్షల చొప్పున మూడు ఎకరాలకి తొమ్మిది లక్షల పెట్టుబడి పెట్టగా ఒక్కో చెట్టుకి 200 కేజీల వరకు అవకాడోలు పండాయి. కేజీ 110 రూపాయలు చొప్పున మార్కెట్లో అమ్మగా 33 లక్షలు వచ్చాయి. ఆయన పెట్టుబడి కింద పెట్టిన తొమ్మిది లక్షలు తీసేగా 24 లక్షల లాభం వచ్చింది.