స్ఫూర్తి: చెత్త బండి లాగుతూ చదువుకుంది… ఐఏఎస్‌ అవ్వాలని ప్రయత్నం.. శభాష్ జయలక్ష్మి..!

-

కొంతమంది లైఫ్ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది పేదరికం వంటివి అసలు చదువుకి అడ్డంకి కాదని చాలామంది ఇప్పటికే చేసి చూపించారు. అలానే జయలక్ష్మి కూడా. జయలక్ష్మి సక్సెస్ జర్నీ చూస్తే మీరు కూడా శభాష్ అంటారు. మూసారాబాగ్ సమీపంలో సలీం నగర్ లో చెత్త బండి వచ్చింది అంటూ జయలక్ష్మి చెత్తని తీసుకు వెళ్తూ ఉంటుంది డిగ్రీ చదువుతూ తల్లి నడిపే చెత్త బండిలో సహాయం చేస్తుంది జయలక్ష్మి.

మురికివాడ పిల్లల కోసం ట్యూషన్స్ కూడా చెప్తుంది వాలంటీర్ గా కూడా పనిచేస్తుంది ప్రతిష్టాత్మక గాంధీ కింగ్ స్కాలర్లీ ఎక్స్చేంజ్ ఇనిషియేటివ్లో భాగంగా జూన్ లోని అమెరికా వెళ్లి వచ్చింది జయలక్ష్మి. ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వారి గాంధీ కింగ్ ఎక్స్చేంజ్ ఇనిషియేటివ్ స్కాలర్షిప్ ద్వారా అమెరికా వెళ్లి రెండు వారాలు ఆమె ప్రజా ఉద్యమాలు ఎలా నిర్వహించాలో అధ్యయనం చేసి రావడానికి దరఖాస్తులు కోరినప్పుడు ఎన్నో అప్లికేషన్లు వచ్చాయి. 10 మంది మాత్రమే ఎంపిక చేశారు.

తెలుగు రాష్ట్రాల నుండి ముగ్గురు ఉండగా అందులో జయలక్ష్మి ఒకరు చిన్నప్పటినుండి కూడా జయలక్ష్మి చురుకుగా ఉండేది. కాలనీలో సమస్యల గురించి ఆమె మాట్లాడేది హైదరాబాదులో 56 స్లమ్స్ ఉంటే అందులో 21 చోట అంగన్వాడి కేంద్రాలు లేవు. మహిళా సంక్షేమ శాఖ దగ్గరికి వీళ్లంతా కూడా వెళ్లి మాట్లాడి సాధించారని జయలక్ష్మి చెప్పింది. ఇంగ్లీష్ మీడియం లో చదవాలని నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లి చదువుకునేవారట సాధించాలనే లక్ష్యం బలం ఉంటే ఎటువంటి ఇబ్బందులు అయినా సరే దాటేయచ్చని చెప్పింది జయలక్ష్మి. ఐఏఎస్ అవ్వాలని ఆమె అనుకుంటోంది. ఆమె సక్సెస్ అవ్వాలని మనమూ కోరుకుందాం.

Read more RELATED
Recommended to you

Latest news