తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. మరో నాలుగు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాల్టికి ఎల్లో అలర్ట్ జారీ చేయగా… సోమవారానికి ఎలాంటి అలర్ట్ ఇవ్వలేదు. మంగళ, బుధవారాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, KMM, NLG, SRPT, మహబూబాబాద్, WGL, హనుమకొండ, మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. మరోవైపు ఈసారి ముందస్తుగానే ఈశాన్య రుతుపవనాల రాక మొదలు కావొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది.