స్ఫూర్తి: రూ. లక్షల్లో టర్నోవర్.. ఎకో ఫ్రెండే ఐడియా అదుర్స్..!

-

చాలామంది లైఫ్ లో సక్సెస్ అవ్వాలని అనుకుంటారు కానీ అందరూ సక్సెస్ ని అందుకోలేకపోతుంటారు. కొంతమంది సరిగ్గా ప్రయత్నం చేయకపోతే కొంతమంది సరిగ్గా ప్లానింగ్ చేసుకోక విఫలమవుతుంటారు. అయితే ఈయన సక్సెస్ ని కనుక మీరు చూసినట్లయితే కచ్చితంగా చప్పట్లు కొడతారు. గోధుమ రవ్వ, చింతపండుతో ప్లేట్లు తయారు చేస్తూ లక్షల్లో టర్నోవర్ ని అందుకుంటున్నారు మరి ఇక సక్సెస్ఫుల్ బిజినెస్ తో రాణిస్తున్న ఈయన సక్సెస్ స్టోరీ ని చూసేద్దాం.

ఈరోజుల్లో ప్లాస్టిక్ ప్లేట్లు ప్లాస్టిక్ గ్లాసులను చాలా చోట్ల బ్యాన్ చేసేసారు పైగా వాడడం మంచిది కాదు. ప్లాస్టిక్ ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుంది. ఎకో ఫ్రెండ్లీ బిజినెస్ ని అందుకే ఈయన మొదలుపెట్టారు. తమిళనాడులోని కోయంబత్తూర్ కి చెందిన కళ్యాణ్ కుమార్ ప్లాస్టిక్ ని నివారించాలని అనుకున్నారు. అందుకోసం వ్యర్థ పదార్థాలతో వస్తువులను తయారు చేయాలనుకున్నారు వినియోగించిన తర్వాత కూడా వాటిని ఏదోలా వాడుకోవాలని ఆ ఆలోచనతోనే గోధుమ రవ్వ, ధాన్యం పొట్టు, చింతపండు, పప్పులు ఇటువంటి వాటితో టీ కప్పులు ప్లేట్లు స్పూన్లు వంటివి తయారు చేయాలనుకున్నారు.

అందుకోసం ఒక ప్రత్యేకమైన యంత్రాన్ని కూడా తయారు చేశారు. ఇంట్లోనే ఈ వస్తువులు మనకి లభిస్తూ ఉంటాయి. వీటికి ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగింది. అయితే ఈ ప్లేటులో గ్లాసుల్లో మనం తినేసి తాగేసిన తర్వాత వాటిని పారేయక్కర్లేదు. వాటిని మనం పెంపుడు జంతువులకి పెట్టొచ్చు. ఆ ప్లేట్లని గ్లాసులుని జంతువులకు ఆహారంగా పెట్టచ్చు.

ఇలా చేయడం వలన పర్యావరణానికి ఎలాంటి హాని కూడా కలగదు అయితే వీటిని తయారు చేసే మిషన్ మూడు లక్షల నుండి 35 లక్షల వరకు ఉంటుందట. మూడు లక్షల యంత్రం రోజుకి వెయ్యి కప్పుల వరకు తయారు చేస్తుందని కళ్యాణ్ అన్నారు ప్రస్తుతం రోజు 10 లక్షల కప్పులు అమ్ముతున్నట్లు కళ్యాణ్ తెలిపారు. ఐడియా అదిరింది కదా అని ఈయన సక్సెస్ ని చూసి అంతా చప్పట్లు కొడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news