స్ఫూర్తి : 7 గోల్డ్‌ మెడల్స్‌.. ఈమె సక్సెస్ స్టోరీ ఇదే..!

-

ఎంతో కష్టపడితే కానీ సక్సెస్ అవ్వలేము ప్రతి ఒక్కరు కూడా అనుకున్నది సాధించడం కోసం అనేక ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. అప్పుడే ఖచ్చితంగా గెలుపొందడానికి అవుతుంది లేక పోతే ఓటమి తప్పదు. ఈమె సక్సెస్ ని చూస్తే కచ్చితంగా ఎవరైనా శభాష్ అంటారు. ఏడు గోల్డ్ మెడల్స్ ని ఈమె సాధించింది ఇక మరి ఈమె సక్సెస్ స్టోరీ ని చూసేద్దాం.. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర పశువైద్యశాల 12వ స్నాతకోత్సవంలో బ్యాచిలర్ ఆఫ్ బెటర్నరీ సైన్స్ చదివిన ప్రత్యూష ఏకంగా ఏడు గోల్డ్ మెడల్స్ ని సాధించింది.

 

ఆంధ్రప్రదేశ్ పశు వైద్యానికి సంబంధించిన ఏకైక యూనివర్సిటీ ఇది. ఇదివరకు పశువైద్యంలో మగవాళ్ళే 90% మంది ఉండేవారు ఇప్పుడు 60 నుండి 70 శాతం మంది అమ్మాయిలే ఉంటున్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బరేలీలో ‘ఇండియన్‌ వెటర్నరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’లో పిజి సీటు ని కూడా ఈమె సాధించింది. వెటర్నరీ మైక్రోబయాలజీ చేస్తుండటం వల్ల మొన్నటి స్నాతకోత్సవానికి హాజరు కాలేదు ఈమె.

కాని 7 గోల్డ్‌ మెడల్స్‌ సాధించడం ఎంతో సంతోషంగా ఉంది అని ఆమె అంది. చదువులో బాగా రాణించాలని రోజుకు ఆరు గంటలు ఈమె చదివేది. సీనియర్లు, అధ్యాపకులు బాగా ప్రోత్సహించారు అని కూడా ఆమె అంది. ఇందులో దాదాపు 17 గోల్డ్‌మెడల్స్‌ ఉంటాయట. ఈమెకి 7 వచ్చాయి. ఇది కదా సక్సెస్ అంటే.

Read more RELATED
Recommended to you

Latest news