వానాకాలంలో ఇంటి గోడలపై వచ్చే తేమ, ఫంగస్ మచ్చలని.. ఇలా సులభంగా మాయం చేసేయచ్చు..!

-

వానా కాలంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వ్యాపిస్తుంటాయి. ఇలాంటిప్పుడే శుభ్రత పట్ల మనం మరింత శ్రద్ధ వహించాలి. వానా కాలం లో గోడలని, ఫ్లోర్ ని కూడా బాగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా వానా కాలంలో గోడల మీద వచ్చే తేమ, ఫంగస్ అచ్చులని క్లీన్ చేయడం మర్చిపోకండి. ఇటువంటివి తొలగించక పోతే అనేక రకాల అనారోగ్య సమస్యలు వ్యాపించే ఛాన్స్ ఉంది. ఎప్పుడూ కూడా కిటికీలని ఓపెన్ చేసి పెట్టాలి.

గాలిని లోపలికి రానివ్వాలి. గోడలు, అల్మరాలు పక్కన పెట్టుకోవద్దు. ఎప్పుడు కూడా లోపలికి గాలి వచ్చే విధంగా ఉంటే గోడకి ఫంగస్ వంటివి చేరవు. అలానే నిలిచిపోయిన కలుషితమైన నీటిని ఉపయోగించే ముందు జాగ్రత్త ఉండండి ఇంట్లో తడి వస్తువులు లేకుండా జాగ్రత్త పడండి. తడి బట్టలు తడి వస్తువులను బయట పెట్టండి.

త్వరగా శుభ్రం చేసి వాటిని ఆరబెట్టండి. కిటికీలని కూడా ఓపెన్ చేసి పెట్టండి. నీటి తో తడి వస్తువులను క్లీన్ చేసుకోండి. ఫ్రిడ్జ్, ఫ్యాన్లు కూడా క్లీన్ చేసుకోండి. ప్రతిదీ కడిగి శుభ్రం చేస్తే బ్యాక్టీరియా చేరదు. మురికి పోతుంది. మాస్క్ ధరించి మీరు వస్తువులను క్లీన్ చేస్తూ ఉండండి కళ్ళజోడు కూడా పెట్టుకోండి. క్లోరిన్ బ్లీచ్ వంటివి ఉపయోగించేటప్పుడు గ్లౌజులు వేసుకోండి ఇలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి. ఇలా మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటే వానాకాలం లో ఏ ఇబ్బంది కూడా రాదు. ఏ బ్యాక్తీరియా కూడా చేరవు.

Read more RELATED
Recommended to you

Latest news