స్ఫూర్తి : సాఫ్ట్‌వేర్ జాబ్ ని వదిలేసి.. ఆవులు తో లక్షల్లో సంపాదన.. ఈయన కథ చూస్తే మెచ్చుకుంటారు..!

-

కొంతమంది సక్సెస్ ని చూస్తే చప్పట్లు కొట్టాలనిపిస్తుంది. మెచ్చుకోవాలనిపిస్తుంది అలాంటి ఆయనే నెల్లూరు కి చెందిన వినోద్ కుమార్. వినోద్ కుమార్ సక్సెస్ ని చూస్తే ఎవరైనా మెచ్చుకోక ఉండరు. చాలా మంది ఈ రోజుల్లో ఉద్యోగాలను కాదని వ్యాపారాలను మొదలు పెడుతున్నారు. సాఫ్ట్వేర్ జాబ్ ని వదిలేసుకుని వినోద్ కుమార్ ఆవుల్ని మేపుతూ ఏకంగా లక్షలు సంపాదిస్తున్నారు. ఆవుల పోషణలోనే ఆనందం ఉందని ఆయన చెప్పారు.

- Advertisement -

మనసుకు నచ్చిన పని చేస్తే ఖచ్చితంగా అందులో రాణించవచ్చు వినోద్ తల్లిదండ్రులు ఆవులని అమ్మేస్తామని చెప్పగా అది ఇష్టం లేక ఉద్యోగాన్ని వదిలేసుకుని ఆవులని మేపడం మొదలుపెట్టారు. లక్షల్లో వచ్చే జీతం వదిలి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉన్నారు. ఆవులు ద్వారా వచ్చే పేడని పొలంలో ఎరువుగా వాడుతున్నారు. తక్కువ ఖర్చుతోనే పంటలను కూడా పండిస్తున్నారు.

ఒంగోలు ఆవులు అంతరించిపోకూడదని సెవెన్ స్టాల్ ని ఏర్పాటు చేశారు వినోద్ ఒంగోలు జాతి ఆవుల పోషణలో సలహాలు సూచనలు ఇస్తారట. పాల వ్యాపారం వ్యవసాయం చేస్తూ ఇప్పుడు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 100 మందిలో పదిమంది వ్యవసాయం చేస్తే బాగుంటుందని వినోద్ కుమార్ చెప్పారు. ఉద్యోగాన్ని వదిలేసుకుని ఇప్పుడు లక్షల్లో లాభాలని పొందుతున్నారు. వినోద్ ని ఆదర్శంగా తీసుకొని వెళితే కచ్చితంగా మీరు కూడా లక్షల్లో సంపాదించొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...