లక్కంటే ఈ యువకుడిదే..4 ప్రభుత్వ ఉద్యోగాలకి ఎంపిక అయ్యాడు..!!!

-

అదృష్టం ఎప్పుడు, ఎలా తలుపు తడుతుందో, తెలియదు కానీ ఆ క్షణం కోసం ఎంతో మంది కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తూనే ఉంటారు. కానీ ఓ యువకుడికి మాత్రం అదృష్టం తలుపు తీసేవరకూ తడుతూనే ఉంది. ఏంటి అర్థం కాలేదా చాలా మందికి దరిద్రం జేబూలో ఉన్నట్టుగా, ఓ యువకుడికి రివర్స్ లో అదృష్టం జేబూలో ఉంది. ఇలా చెప్పేదానికంటే కూడా అతడి కష్టమే అతడికి గొప్ప వరంలా మారిందని చెప్పడం ఇంకా బాగుటుంది. కష్టపడి చేసే ప్రతీ పని సక్సెస్ అవుతుందని ఎన్నో సంఘటనలు ఋజువు చేశాయి. సరే అసలు విషయం ఏమిటంటే..

తూర్పుగోదావరిజిల్లా గొల్లప్రోలు మండలం, చేబ్రోలు కి చెందిన రాయుడు త్రిమూర్తులు అనే యువకుడు పోటీ పరీక్షలకి పోటీ పడుతూ ఉండేవాడు. స్థానికంగానే అతడి చదువు ఇంజనీరింగ్ వరకూ కొనసాగింది. తరువాత ఉద్యోగం కోసం           కాకినాడ లోని ఓ ప్రవైటు కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగం చేస్తూనే నిర్విరామంగా పోటీ పరీక్షలకి సిద్దమయ్యేవాడు. మార్చి 2019 నుంచీ ఇప్పటికి వరకూ వెలువడిన 4 పరీక్షలలో పోటీ పడి విజయం సాధించాడు.

తెలంగాణా రాష్ట్ర సివిల్ ఎస్సై గా ఒక ఉద్యోగం వరించగా, ఏపీ సివిల్ కానిస్టేబుల్ గా మరొక ఉద్యోగం పొందాడు, దక్షిణ మధ్య రైల్వే లోకో అసిస్టెంట్ పైలెట్ గా అంతేకాక రైల్వే గ్రూప్ డీ పోస్టులకి కూడా సెలెక్ట్ అయ్యాడు. ఇన్ని ఉద్యోగాలకి ఒకే సారి ఎంపిక కావడంతో అతడి తల్లి తండ్రులు ఉబ్బి తబ్బిబవుతున్నారు. అయితే పోలీస్ ఉద్యోగం అంటే ఎంతో ఇష్టమని తెలంగాణా సివిల్ పోలీస్ ఎస్సై గా  చేయడానికి ఇష్టపడుతున్నట్టుగా తెలిపాడు. బంధువులు, స్నేహితులు అందరూ త్రిమూర్తులుని అభినందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news