ఒక్క వీడియో జోమాటో డెలివరి బాయ్ లైఫ్ మార్చేసింది…!

-

ఉద్యోగం చేస్తే సంతోషంగా చెయ్యాలి. జీతం ఎంత అయినా సరే ఉద్యోగంలో హింస లేనప్పుడు సంతోషంగా చేసుకోవాలి. అదే మనకు మంచి చేస్తుంది. ఈ మాటలు చాలా మంది చెప్తూ ఉంటారు. తాజాగా ఒక జోమాటో ఫుడ్ డెలివరి పోస్ట్ చేసిన ఒక వీడియో అతని తల రాతను మార్చేసింది. టిక్ టాక్ లో ఒక ఫుడ్ డెలివరి బాయ్ శుక్రవారం ఒక వీడియో పోస్ట్ చేసాడు. ఈ వీడియో విస్తృతంగా వైరల్ అయింది.

ఒక రైడర్ ఈ వీడియో లో నవ్వుతూ కనపడతాడు. ఆ స్క్రీన్ షాట్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తుంది. “ఇది ఇప్పుడు హ్యాపీ రైడర్ ఫ్యాన్ ఖాతా” అని జోమాటో తన ప్రొఫైల్ ఫోటో మార్చేసింది. సోను అనే ఫుడ్ డెలివరి బాయ్ ఈ వీడియో చేసినట్టు గుర్తించారు. ఒక వ్యక్తితో అతని ఉద్యోగం గురించి సంభాషణ, వీడియోలో రికార్డ్ చేసారు. తర్వాత ఆ వీడియో ని టిక్ టాక్ లో పోస్ట్ చేసారు. క్లిప్, వెంటనే, వైరల్ అయ్యింది మరియు ట్విట్టర్లో కూడా హల్చల్ చేసింది.

ఇంటర్నెట్ అంతటా సోను వీడియో వైరల్ గా మారింది. ఇక అతన్ని జోమాటో హ్యాపీ రైడర్ అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. @Twitterfrankmartynn ట్విట్టర్‌లో పంచుకున్న టిక్‌టాక్ వీడియోలో, సోను తన ఉద్యోగం గురించి పెద్ద చిరునవ్వుతో మాట్లాడాడు మరియు జోమాటోతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని చెప్పాడు. ప్రోత్సాహకాలతో పాటు తన చెల్లింపును జోమాటో నుండి సకాలంలో స్వీకరిస్తానని చెప్పాడు.

https://twitter.com/frankmartynn?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1233315813635108865%7Ctwgr%5E&ref_url=https%3A%2F%2Fwww.indiatoday.in%2Ftrending-news%2Fstory%2Fzomato-changes-profile-picture-to-happy-rider-after-his-tiktok-video-goes-viral-internet-can-t-stop-gushing-1651155-2020-02-29

Read more RELATED
Recommended to you

Latest news