అవకాశాలని దేవుడే ఇస్తాడు.. కానీ గుర్తించకుండా వాటిని దూరం చేసుకుంటామని తెలిపే కథ.

-

ఒకానొక ఊరు. ఊళ్ళో చిన్న గుడి. నిత్యం దేవుడికి పూజ చేసే పూజారి. ఆ ఊరికి కొద్ది దూరంలోనే ఒక నది. ఊళ్ళో ప్రజలందరూ నది మీద ఆధారపడుతూ గుళ్ళో దేవుడికి ప్రార్థనలు చేస్తూ తమ పని తాము చేసుకుంటూ గడుపుతున్నారు. వర్షాకాలంలో ఒకానొక రోజు నదికి వరదలు వచ్చాయి. ఊర్లలోకి నీళ్ళు రాసాగాయి. అప్పటి కప్పుడే ఊరిని ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడే ఒకతన్ను గుడి వద్దకి వెళ్ళి అక్కడే ఉన్న పూజారితో ఇలా అన్నాడు.

వరదలు ఊరిని ముచెత్తుతున్నాయి. మేమందరం ఊరిని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం. మీరు కూడా మాతో వచ్చేయండి. దానికి పూజారి, నాకు దేవుడు సాయం చేస్తాడు. నువ్వు వెళ్ళవచ్చు అని దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నాడు. వరద ప్రవాహం మరింత పెరిగింది. నడుము పైభాగానికి నీళ్ళూ రాసాగాయి. అప్పుడు పడవ తీసుకుని మరో వ్యక్తి పూజారి వద్దకి వెళ్ళాడు. గుడి పై భాగాన ఉన్న పూజారిని, పదండి వెళ్దాం, వరద ముంచెత్తుతుంది అని అనగానే, నువ్వెళ్ళు, నన్ను దేవుడు కాపాడతాడని ప్రార్థనలో మునిగిపోయాడు.

అప్పుడు వరదలు ఇంకా పెరిగి, గుడి పైభాగానికి చేరాయి. గుడి శిఖరంపై ఉన్న పూజారిని కాపాడడానికి హెలికాప్టర్ వచ్చింది. అప్పుడు కూడా పూజారి అదే సమాధానం ఇచ్చాడు. గుడి పూర్తిగా మునిగిపోయింది. అతడి తల మాత్రమే పైకి కనిపిస్తుంది. అప్పుడు పూజారి, దేవుడా బ్రతికినంత కాలం నీకోసమే పూజలు చేసాను. ఈ రోజు నేను చనిపోయే పరిస్థితి వస్తే నన్ను కాపాడడానికి రాలేవా అని నిందించాడు. ఆ మాటలకి దేవుడు ప్రత్యక్షమయ్యాడూ. పిచ్చివాడా నిన్ను కాపాడడానికి మూడు సార్లు వచ్చాను. నువ్వే గుర్తుపట్టలేదు అనగానే పూజారికి అంతా గుర్తొచ్చింది.

దేవుడు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. మనమే వాటిని గుర్తించకుండా అవకాశాల కోసం ఎదురుచూస్తూనే ఉంటాం.

డేర్ టు డూ మోటివేషన్ యూట్యూబ్ ఛానల్ లో ఈ కథ పబ్లిష్ అయ్యింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version