విధులు నిర్వర్తిస్తూ.. మంచి భవిష్యత్‌కు అడుగులు వేయాలని..!?

-

న్యూఢిల్లీ: కృషి, పట్టుదల ఉంటే మనిషి ఏమైనా సాధించగలడు.. గతంలో మనం చాలా మంది ప్రముఖుల జీవిత చరిత్రను చదివి ఉంటాం. అందులో చాలా మంది.. తాము పడిన కష్టాల గురించి చెబుతూ వచ్చారు. తరగతి గది బయట నుంచి క్లాస్ విని ప్రయోజకుడైన వారిని, వీధి లైట్ల కింద చదివి ఉత్తములైన వారి స్టోరీలు చదివి ఉంటాం. ఇవి మనకు ఎంతో ప్రేరణను కలిగిస్తాయి. ఇలాంటి ఇన్‌స్పైరింగ్ స్టోరీలు చదివినా, ఫోటోలు చూసినా.. మనలో తెలియని ఆనందం, అలా మనము కూడా చేయాలని అనిపిస్తుంది. అయితే.. తాజాగా అలాంటి ప్రేరణ పెంచే ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటోను చూసిన ప్రతిఒక్కరూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఫోటోను చూసి అంతలా ఇన్‌స్పైర్ అయ్యేంతలా ఏముందనేగా మీ ప్రశ్న.. అయితే పూర్తి విషయాన్ని తెలుసుకుందాం రండి.

సెక్యూరిటీ గార్డు-చదువు

ఐఏఎస్ అధికారి అవనీశ్ శరణ్ తన ట్విట్టర్ అకౌంట్‌లో ప్రేరణకు సంబంధించిన ఒక ఫోటోను పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో ఒక ఏటీఎం సెక్యూరిటీ గార్డు విధులు నిర్వర్తిస్తూనే.. మంచి భవిష్యత్‌ను సాధించుకోవాలని, ఉన్నత ఉద్యోగంలో చేరాలనే కలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఏటీఎం సెంటర్‌లో ఓ మూలన కూర్చొని విధులు నిర్వహిస్తూ.. పుస్తకాలు పట్టుకుని చదువుతున్నాడు. ఇలాంటి ప్రేరణ ఫోటోను అవనీశ్ శరణ్ తన ట్విట్టర్ ఖాతాలో ఇటీవల పోస్ట్ చేశాడు. దీనికి ‘‘నీలో ఎక్కడైనా మంట (కసి) ఉండొచ్చు.. కానీ, అది రాచుకుని ఉండాలి.’’ అని క్యాప్షన్ ఇచ్చారు.

ఐఏఎస్ అధికారి అవనీశ్ శరణ్ సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. తన ట్విట్టర్ ఖాతాలో ఎప్పుడూ స్ఫూర్తిదాయకమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటాడు. వారంరోజుల కిందట పోస్ట్ చేసిన ఈ ప్రత్యేక చిత్రానికి ఇప్పటివరకు చాలా మంది చూశారు. దీనికి రీట్విట్లు కూడా చేశారు. పేద, మధ్య తరగతికి చెందిన వారు చదువుపైన మక్కువ ఉండి ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొవడం సర్వసాధారణం. కానీ చాలా మంది జీవితంలో చదువును నెగ్లెట్ చేసి డబ్బు సంపాదించడం కోసం పరుగెత్తుతారు. అయితే ఈ ఫోటో భారతదేశంలోని అనేక పెద్ద వ్యక్తుల కృషికి ఉదాహరణగా చూపించవచ్చు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పాజిటివ్ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version