నిండుగర్భంతో ఆపకుండా ఆరుగంటలపాటు కర్రసాము విన్యాసాలు

-

ఆడవారు అసలే సున్నితమనస్థులు.. భారీ భారీ పనులు చేయడం అంటే..కాస్త వెనకాడతారు.. ఇక ప్రెగ్నెస్సీ టైంలో.. వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి.. కుటుంబసభ్యులు అయితే ఇక నెలలు నిండే కొద్ది.. వారిని ఇటు పుల్ల తీసి అటు కూడా పెట్టనివ్వరు. అంత జాగ్రత్తగా చూసుకుంటారు. వంగోని లేవాలన్నా వారికి కష్టమే.. ఫైనల్ గా డెలివరీ టైం కి విపరీతంగా నొప్పులను భరిస్తూ.. పండంటి బిడ్డకు జన్మనిస్తారు.. సాధారణంగా.. ఏ మహిళ లైఫ్ లో అయినా…ప్రెగ్నెస్సీ టైంలో ఇదే జరుగుతుంది.. కానీ..ఆమె.. తొమ్మిదినెలల నిండు గర్భంతో..ఆపకుండా ఆరుగంటల పాటు.. కర్రసాము విన్యాసాలు చేస్తూ..ఔరా అనిపిస్తుంది. తమిళనాడులోని అనైక్కడు గ్రామానికి చెందిన షీలాదాస్‌ ధైర్యసాహసాల గురించి అందరూ తెలుసుకోవాల్సిందే..!

షీలాదాస్‌కు చిన్నతనం నుంచే ఆటలంటే మక్కువ. అందుకే కర్రసాము, బాక్సింగ్‌, కరాఠే.. వంటి విద్యలను నేర్చుకున్నారు. చదువుకుంటోన్న క్రమంలోనే వివిధ పోటీల్లో పాల్గొని బోలెడన్ని బహుమతులను సాధించారు. ఇక పెళ్లయ్యాకా తన భర్త ప్రోత్సాహంతో ఈ మార్షల్‌ ఆర్ట్స్‌ని కొనసాగించారట.

కరాటేలో బ్లాక్‌ బ్యాడ్జ్‌ సాధించిన షీల.. ప్రజెంట్ ఎంతోమందికి శిక్షణ ఇస్తున్నారు. గతంలో నిర్వహించిన ఓ వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలో భాగంగా ‘ఐరన్‌ ఉమన్‌’ టైటిల్‌తో పాటు జాతీయ రికార్డునూ కైవశం చేసుకున్నారు. తొమ్మిది నెలల నిండు గర్భిణి అయిన షీల.. ఇటీవలే ‘అనైక్కడు సిలంబం అసోసియేషన్‌’ వారు నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని… ఆరు గంటల పాటు విడవకుండా కర్రసాము విన్యాసాలు చేశారు. తొలుత మూడు గంటలు ఒక కర్రతో, మరో మూడు గంటలు రెండు కర్రలతో విన్యాసాలు ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె కర్రసాముకు ఫిదా అయిన ‘నోబెల్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ వారు ఆమెకు బహుమతితో పాటు సంబంధిత ధ్రువపత్రాన్ని అందించి గౌరవించారు.

మానసికంగా దృఢంగా ఉండడం వల్ల ఇప్పుడీ రికార్డు సొంతమైందని… పోటీలో పాల్గొనడానికి ముందే నిపుణులతో సంబంధిత పరీక్షలన్నీ చేయించుకున్నట్లు.. వారి అంగీకారం మేరకే నిర్విరామంగా ఫీట్‌ పూర్తిచేయగలిగానని షీల పేర్కొంది. ముందు నుంచే.. ఈ యుద్ధకళల్లో ప్రావిణ్యం ఉంది కాబట్టి. షీల ఈ రికార్డును సొంతం చేసుకోగలిగింది. గర్భిణీలు కఠినమైన వ్యాయామాలు చేయడం అంత సాధ్యం కాదు. అలవాటు లేని పని ఆ టైంలో అస్సలు చేయకూడదు. ఈ కథనం కేవలం మీకు తెలియజేయడానికే అని గమనించగలరు.

-Triveni Buskarwothu

Read more RELATED
Recommended to you

Latest news