అండమాన్ ను వణికిస్తున్న ‘ ఆసానీ’ తుఫాన్

అండమాన్ నికోబార్ దీవులను తుఫాన్ భయపెడుతోంది. ‘ ఆసానీ’ తుఫాన్ అండమాన్ నికోబార్ దీవులను సమీపంలో తుఫాన్ ఏర్పడింది. దీంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండాన్ సముద్రాన్ని అనుకుని ఏర్పడిన అల్పపీడనం అండమాన్ నికోబార్ వైపు కదులుతూ.. రేపటికి తుఫాన్ గా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. మార్చి 22 నాటికి ఈశాన్య బంగ్లాదేశ్, మయన్మార్ తీరాలని తుఫాన్ చేరుకునే అవకాశం  ఉంది. నిన్నటి నుంచి నికోబార్ దీవుల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.

 మరో ఒకటి రెండు రోజులు బలమైన గాలుల, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు చెేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అండమాన్ నికోబార్ దీవుల్లోని పర్యాటక ప్రాంతాలను మూసేశారు. తుఫాన్ దృష్ట్యా విపత్తు నిర్వహణ దళాలు, ఎన్డీఆర్ఎఫ్ బలాలు మోహరించాయి. లోతట్టు ప్రాంతాలను  ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తోంది.