Success Story : వంటలే తన పెట్టుబడి.. లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్న హైదరాబాదీ మహిళ..!

-

Success Story :  ప్రస్తుత కాలంలో మహిళలు కేవలం వంటింటికే పరిమితం అవ్వకుండా మగాళ్లతో పాటు సమానంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. చాలా మంది మహిళలు ఇప్పుడు వ్యాపార రంగంలో కూడా సక్సెస్ అవుతున్నారు. అలాంటి మహిళల్లో హైదరాబాద్ కి చెందిన నాజ్ అంజుమ్ అనే సాధారణ మహిళ ఒకరిగా నిలిచి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Success Story నిజానికి ఆమె పెళ్లి తర్వాత 2010లో హైదరాబాద్ సిటీకి మకాం మార్చారు. ఆమె ఒక టెక్స్‌టైల్ ఇంజనీర్. అయితే ఆమెకు వంటలంటే చాలా ఇష్టం. చాలా అద్భుతంగా వంటలు చేస్తుంది. అలా ఆమె చేసే వంటలు బిల్డింగ్ లోని బ్యాచిలర్స్, ఇరుగుపొరుగు వారికి చాలా బాగా నచ్చేవి. అలా వారి ప్రశంసలు నాజ్ అంజుమ్ తన వంట ప్రతిభను వ్యాపారంగా మార్చేలా తర్వాతి కాలంలో ప్రోత్సహించాయట. సాయంత్రం వేళల్లో కూరల కోసం ఆమె బిల్డింగ్ లో ఉండే బ్యాచిలర్స్ రుచికరమైన వంటకాల కోసం నాజ్‌ను సంప్రదించడం స్టార్ట్ చేశారు.

వారి అభిమానం పెరిగేకొద్దీ వివిధ రకాల ఆర్డర్‌లు కూడా ఆమెకు పెరిగాయి. రోజువారీ టిఫిన్‌ల కోసం అభ్యర్థనలు కూడా వచ్చాయి. అలా వారి సపోర్ట్ తో 2016లో ప్రేరేపించబడిన నాజ్ తన ఇంటి నుంచే ‘అంజూమ్స్ కిచెన్’ అనే పేరుతో క్లౌడ్ కిచెన్ బిజినెస్ లోకి అడుగుపెట్టింది. బిర్యానీ అంటే ఎక్కువ ఇష్టం ఉన్న ఆమె కేవలం ఆ సమయంలో రూ.80 పెట్టుబడిగా పెట్టి తన వ్యాపార ప్రయాణాన్ని మెుదలుపెట్టారు.2016లో రంజాన్ పండుగ మాసంలో నాజ్ వంటల ప్రయాణం అయితే పెద్ద మలుపు తిరిగింది.

ఆమె చేసిన ‘డబుల్ కా మీఠా’, ‘లౌకీ హల్వా’ వంటి స్పెషల్ డెజర్ట్‌లు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత ఆమె HITEC సిటీలో ఒక చిన్న సమావేశానికి మటన్ దమ్ బిర్యానీతో అధికారికంగా మెుదటి ఆర్డర్ పొందింది. ఈ ఆర్డర్ తర్వాత వరసగా ఆర్డర్లు రావటంతో ఆమె బిర్యానీకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ‘అంజమ్స్ కిచెన్’ వేగంగా హైదరాబాద్‌లోని మహిళల యాజమాన్యంలోని క్లౌడ్ కిచెన్‌లలో ఫేమస్ అయ్యింది. రోజువారీ టిఫిన్‌లు, బిర్యానీలు, పార్టీ ఆర్డర్‌లు, డెజర్ట్‌లకు అంజమ్స్ కిచెన్ ఫేమస్ అయింది.

అలా కేవలం మౌత్ పబ్లిసిటీతో పాపులర్ అయ్యి సక్సెస్ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో కూడా ఆమె వంటల వ్యాపారం గురించి ప్రచారాన్ని పెంచింది.ఇప్పుడు ‘అంజూమ్స్ కిచెన్’ ఒక అభివృద్ధి చెందుతున్న పాకశాస్త్ర సంస్థగా మారింది. 25-50 రోజువారీ ఆర్డర్‌లను అందుకుంటూ నాజ్ నెలకు ఏకంగా రూ.లక్ష ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. కరోనా మహమ్మారి సమయంలో అయితే నాజ్ భారీగా ఆర్డర్లు పొందారు.

Read more RELATED
Recommended to you

Latest news