బోన్ డిసార్డర్ సమస్యతో బాధపడుతున్నా.. స్లమ్ లో ఉంటున్నా.. ఫస్ట్ అటెంప్ట్ లోనే ఐఏఎస్ ప్యాస్..!

-

జీవితమంటే కేవలం సంతోషంగానే ఉండదు. ఒక్కొక్కసారి కష్టాలు ఉంటాయి, ఒక్కొక్కసారి ఆనందాలు కూడా ఉంటాయి. ఏది ఎప్పుడు వస్తుంది అనేది చెప్పలేము. అయితే నిజానికి ఎన్నో కష్టాలు ఉన్నా సరే మనం అనుకున్నది సాధించ వచ్చు. అంతే కానీ మీరు మీ యొక్క నమ్మకాన్ని కోల్పోవద్దు. నిజానికి ఈమె జీవితమంతా వీల్ చెయిర్ లోనే నడిచింది.

 

స్లమ్ లో ఉండి ఎన్నో కష్టాలను అనుభవించింది. అయినప్పటికీ మొదటి అటెంప్ట్ లోనే ఐఏఎస్ క్వాలిఫై అయింది. మరి ఈమె గురించి చూస్తే.. ఈమె పేరు ఉముల్ కేర్. బోన్ సమస్యతో ఈమె చిన్నప్పటి నుండి కూడా సతమతమవుతోంది. ఢిల్లీలో ఒక స్లమ్ ఏరియాలో ఈమె జీవించేది.

అయినప్పటికీ చదువు మానలేదు. అలా ఆమె సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ని ఫస్ట్ అటెంప్ట్ లోనే క్వాలిఫై అయింది. ఈమె కన్న కలలు నిజమయ్యాయి. అలానే అనుకున్నది సాధించ గలిగింది. అయితే ఇది కేవలం పరీక్షలో సక్సెస్ మాత్రమే కాదు జీవితంలో సక్సెస్ కూడా. అది కూడా అంత కష్టమైన పరీక్ష క్వాలిఫై అవడం అంటే మాటలు విషయం కాదు.

ఈమె రాజస్థాన్ ప్రాంతానికి చెందిన ఆమె. అయితే ఈమె చిన్నప్పుడే కుటుంబం ఢిల్లీ వచ్చేసారు. నిజాముద్దీన్ స్లమ్ ఏరియాలో వీళ్లు ఉండేవారు. ఈమె బోన్ డెన్సిటీ సమస్యతో బాధ పడింది. 16 ఫ్రాక్చర్లు, 8 సర్జరీలు అయ్యాయి. పైగా ఈమె స్లమ్ ఏరియాలో ఉండే విద్యార్థులకు కూడా ట్యూషన్ చెప్పేది.ఈమె గ్రాడ్యుయేషన్ మరియు మాస్టర్స్ ని పూర్తి చేసింది.

2013లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ లో ఎంపికై 25 వేలను స్టైఫండ్ గా తీసుకుంది. యూపీఎస్సీ సివిల్స్ సర్వీసెస్ ఫస్ట్ అటెంప్ట్ ని 2017లో ఇచ్చి 420 ర్యాంక్ సాధించింది. నిజానికి మన మీద నమ్మకం ఉండి మనం ముందుకు వెళ్తే కచ్చితంగా మనం కన్న కలలు నెరవేరుతాయని ఈమె చెప్పింది. ఒకపక్క ఆరోగ్యం లో సమస్యలు ఉన్నప్పటికీ సరే ఆమె ధైర్యాన్ని కోల్పోలేదు. ఈమెని ఆదర్శంగా తీసుకుంటే మనం కూడా విజయం సాధించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news