ఆరేళ్లకే యూట్యూబ్ స్టార్ అయింది.. ఇప్పుడు నెలకు 16కోట్లు సంపాదిస్తోందీ బుడ్డది..!

-

అసలు ఈ జనరేషన్ పిల్లలు ఎంత ఫాస్ట్ గా ఉన్నారో..90s పుట్టిన వాళ్లు ఇప్పుడు ఉన్న బుడతలను చూస్తే..ముక్కున వేలు వేసుకోవాల్సిందే.. సరిగ్గా మాటాలు కూడా రావు..అప్పుడే సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోతున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో మనం ఎంతమందిని చూశాం.. ఇప్పుడు రష్యాలోని ఓ ఎనిమిదేళ్ల చిన్నారి.. యూట్యూబ్ ఛానల్ నడుపుతూ.. కోట్లు సంపాదిస్తోందట.

రష్యా చిన్నారి అనస్తాసియా రాడ్జిన్స్ కాయా బొమ్మలతో ఆడుతూ డబ్బు సంపాదిస్తోంది. ఆమె ప్రతి ఆటా కోట్లు కురిపిస్తోంది. ఈ పాపకు యూట్యూబ్ లో 11 ఛానెల్స్ ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది Like Nastya. దీనికి 8.6 కోట్ల మంది సబ్‌ స్క్రైబర్లు ఉన్నారు. ఇలా ఆమె మొత్తం 26 కోట్ల మంది సబ్ స్క్రైబర్లను సంపాదించుకుంది.. ఫలితంగా ప్రపంచంలోనే అది పెద్ద చిన్నారి యూట్యూబర్ గా పేరు తెచ్చుకుంది.

2021లో చిన్నారి యూట్యూబర్లలో ఎక్కువ ఆదాయం సంపాదించినది అనస్తాసియానే. ఆమెకు ఆ ఏడాది రూ.200 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుతం ఫోర్బ్స్ ప్రకారం యూట్యూబ్ స్టార్లలో ఎక్కువ సంపాదిస్తున్న వారిలో అనస్తాసియాది ఆరో ర్యాంక్. మొదటి ర్యాంకులో మిస్టర్ బీస్ట్ ఉండగా.. రెండో స్థానంలో జాక్ పాల్ ఉన్నారు. ఆరో ర్యాంకుకే ఇంత వస్తుందంటే..మొదటి ర్యాంకుకు ఎంతవస్తుందో..కదా.!

అనస్తాసియాకి సొంతంగా “లైక్ నాత్స్య” అనే వ్యాపారం కూడా ఉంది. దాంతోపాటూ NFT కలెక్షన్ కూడా ఉంది. అనస్తాసియా.. సొంతంగా పిల్లల పాటల్ని క్రియేట్ చేస్తుంది. బొమ్మలతో ఆడుతుంది. ఫ్యామిలీతో కలిసి ట్రావెల్ చేస్తుంది. అవన్నీ వీడియోలుగా అప్ లోడ్ అవుతాయి. 2014 జనవరిలో పుట్టిన అనస్తాసియాకి సెరెబ్రల్ పాల్సీ (cerebral palsy) అనే అనారోగ్యం ఉందని వైద్యులు చెప్పారు. అందువల్ల ఆమె ఎప్పటికీ మాట్లాడలేకపోవచ్చు అని చెప్పారు. కానీ డాక్టర్లు తప్పుగా అంచనా వేసినట్లు ఈ పాప నిరూపించింది.

2015లో అనస్తాసియా తల్లిదండ్రులు.. ఆమె కోసం ఓ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశారు. ఆమెను మాట్లాడమనీ, నడవమనీ, నచ్చింది చెయ్యమని ఎంకరేజ్ చేశారు. ఎప్పుడైతే అనస్తాసియా మాట్లాడటం మొదలుపెట్టిందో డాక్టర్లు తాము తప్పుగా చెప్పామని తెలుసుకున్నారు. ఐతే.. ఎలాగూ స్టార్ట్ చేశాం కదా అని ఆ ఛానెల్‌ ని కంటిన్యూ చేశారు. తమ నిర్మాణ కంపెనీకి చెందిన వస్తువులు, బ్రైడల్ సెలూన్ సంబంధిత వస్తువుల్ని అమ్మడం ప్రారంభించారు.

అనస్తాసియాకి వస్తున్న క్రేజ్ చూసి 2016లో Like Nastya పేరుతో మరో ఛానెల్ స్టార్ట్ చేశారు. కొత్త కొత్త బొమ్మలను పరిశీలించి, వాడి, అవి ఎలా ఉన్నాయో రివ్యూ ఇవ్వడమే ఆ ఛానెల్ ప్రత్యేకత. ఇప్పుడు ఆ ఛానెల్ రోజురోజుకూ తన సబ్ స్క్రైబర్ల సంఖ్యను పెంచుకుంటోంది. ప్రపంచంలోని టాప్ టెన్ యూట్యూబ్ ఛానెళ్లలో అది ఒకటిగా నిలిచింది.

కొంతమంది పిల్లలు ఉంటారు..టెక్నాలజీని వాడటం తెలియక..తప్పుదారిలో వెళ్లి లైఫ్ పాడు చేసుకుంటారు..కానీ ఈ పాప..ఇంత చిన్న ఏజ్ లోనే..సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది. మనం జీవితాంతం కష్టపడినా సంపాదించలేని సొమ్ము ఈ బుడ్డది 8 ఏళ్లకే సంపాదించిందంటే..అసలు నోట మాటలేదు. పిల్లకు ఫోను ఇవ్వడంలో తప్పులేదు..కానీ వారు అందులో ఏం చేస్తున్నారు, ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసుకుంటూ..వారి ఆలోచనలను ఎంకరేజ్ చేసే పేరెంట్స్ ఉంటే చాలు.!

 

View this post on Instagram

 

A post shared by Like Nastya (@likenastya)

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news