ఇంటర్‌ రెండుసార్లు ఫెయిల్‌.. సీన్‌ కట్‌ చేస్తే నేడు భాగ్యనగరంలోనే అపరకుభేరుడు

-

ఈరోజుల్లో ఒకరు లేదా ఇద్దరు పిల్లలతోనే భార్యభర్తలు సరిపెట్టుకుంటున్నారు. కానీ మన అమ్మల కాలంలో ఒక్కొక్కరికి డజన్లకొద్దీ పిల్లలు ఉండేవాళ్లు. వాళ్లను ఎలా పెంచాలి, ఎలా పెళ్లి చేయాలనే భయం లేకుండా ఆకాలంలో పిల్లలను కన్నారు. ఇంట్లో నలుగురు ఉంటే.. పెద్దవాళ్లు పని చేసేవాళ్లు.. ఆఖరిన పుట్టినవాళ్లు చదువుకునేవాళ్లు. చాలా ఇళ్లలో అదే జరుగింది. అలా 14 మంది ఉన్న కుటుంబంలో పుట్టి పేదరికంలో పెరిగి.. ఇంటర్‌ రెండు సార్లు ఫెయిల్‌ అయినా.. నేడు భాగ్యనగరంలోనే అత్యంత భాగ్యవంతుడిగా ఎదిగాడు. అపరకోటీశ్వరుడైన ఈ వ్యక్తి గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..! డౌన్‌టూ ఎర్త్‌ నుంచి ఫ్లై హై ఇన్‌ ఇద స్కైలా ఎదిగిన అతని పేరు మురిళీ దివి.

ఆంధ్రప్రదేశ్‌లో ఓ చిన్న టౌన్‌కు చెందిన మురళీ దివి.. నేడు ఫోర్బ్స్ జాబితాలో హైదరాబాద్‌లోనే అత్యంత కోటీశ్వరుడిగా నిలిచారు. 53 వేల కోట్ల ఆస్తితో మురళీ దివి భారతీయులు ఎందరికో ఆదర్శం. పదివేల రూపాయిల ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్‌తో గడుస్తున్న కుటుంబంలో పుట్టి, 14మందితో పాటు తాను ఒకడిగా పెరిగాడు. ఇంటర్‌ సెకండియర్‌ రెండుసార్లు ఫెయిల్‌ అయినా చదువుకోవాలన్న ఆశయాన్ని వదల్లేదు. ఆ కాలంలో చదువుకోవడమే గొప్ప.. అలాంటిది..ఇలా ఫెయిల్‌ అయితే ఎవరైనా అక్కడితే చదువుఆపేస్తారు. ఏదో సాధించాలన్న తపన అతన్ని ఆగిపోనివ్వలేదు. మణిపాల్ హైయర్ స్టడీస్ కాలేజీలో చేరి బీఎస్సి చదివాడు. అదే అతని జీవితంలో అనుకోని మలుపుకి దారితీసింది. ఒకరోజులో, ఒక ఏడాదిలో జరిగిన పరిణామం కాదిది. నలభై ఏళ్ళ సుదీర్ఘ శ్రమతో ఏర్పడిన సామ్రజ్యమది. అదే‌‌.. దివీస్ ల్యాబ్స్. ఈ పేరు వినే ఉంటారుగా..!

చిన్నప్పుడు పెద్దగా చదువు ఒంటబట్టని మురళీ.. ఒకానొక సందర్భంలో అతని అన్నలాగే తను కూడా బీఎస్సీ చదవాలని మణిపాల్ కాలేజీలు చేరాడు. అప్పటికే పద్నాలుగు మంది సభ్యులున్న కుటుంబం వారిది‌. వాళ్ళ నాన్న ప్రభుత్వోద్యోగి. డిగ్రీ అయిన తర్వాత మురళి ఓ సంస్థలో ఫార్మసిస్ట్‌గా ఉద్యోగం చేశారు. అప్పుడు అతని జీతం నెలకు 250 రూపాయిలు. 1976లో మురళి తన 25వ ఏట అమెరికా వెళ్ళి ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ టైంలో మురళి చేతిలో ఉన్న డబ్బు 500 వందలు. తెలిసినవాళ్ళ సహాయ సహకారంతో మురళి అమెరికాకు వెళ్ళగలిగారు‌. అక్కడ ట్రినిటీ కెమికల్స్, ఫైక్ కెమికల్స్ వంటి సంస్థల్లో ఫార్మసిస్ట్‌గా జాబ్ చేశారు. అతి తక్కువ కాలంలోనే ఏటా 65 వేల డాలర్ల జీతం గడించే స్థాయికి చేరుకున్నారు‌. ఆ తర్వాత మురళి దివి పలు ఫార్మసిటికల్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ సైంటిస్ట్‌గా ఎదిగారు.

1984లో మురళి 40 వేల డాలర్లతో ఇండియాకు తిరిగి వచ్చారు‌. ఒక స్నేహితుడితో కలిసి కెమినార్ అనే సంస్థను స్థాపించారు. 1989లో కెమినార్ సంస్థను రెడ్డి ల్యాబ్స్ టేకోవర్ చేసింది. అక్కడి నుంచి మురళీ దివి రెడ్డి ల్యాబ్స్‌లో ఆరేళ్ళ పాటు పనిచేశారు. 1995లో మురళీ రెడ్డి ల్యాబ్స్ నుంచి బయటికి వచ్చి సొంతంగా దివీస్ ల్యాబ్స్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ చౌటుప్పల్‌లో మొదటి ఫ్యాక్టరీని 1995లో స్థాపించారు. ఆ తర్వాత ఏడేళ్ళకి 2002లో దివీస్ ల్యాబ్స్ రెండో ఫ్యాక్టరీని విశాఖపట్నంలో స్థాపించారు. ప్రపంచ ఫార్మసిటికల్ రంగానికి అవసరమైన క్రియాశీలక ఔషద పదార్ధాల ఉత్పాదన, సరఫరా చేసే ప్రముఖ సంస్థగా దివీస్ ల్యాబ్స్ ఎదిగింది.

2022లో దివీస్ ల్యాబ్స్ ఏకంగా 88 బిలియన్ల (8800 కోట్లు) వ్యాపారాన్ని చేసి చరిత్ర పుటల్లోకి ఎక్కింది‌. అదే నేడు ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో మురళీ దివికీ చోటు కల్పించింది‌‌. ప్రస్తుతం మురళీ దివి 53 వేల కోట్ల ఆస్తులతో హైదరాబాద్‌లోనే అత్యంత సంపన్నుడిగా పేరుగాంచారు. మోరల్‌ ఆఫ్‌దీ స్టోరీ ఏంటంటే.. మనం ఎదగాలంటే ఎగరాలి..ఉన్నచోటే ఉంటే అవకాశాలు రావు.. పదిఊర్లు తిరిగాలి.. మనలో సాధించాలనే తపన ఉండాలి. అరే నాదగ్గర డబ్బు లేదు కదా ఎలా అని ఆగిపోతే.. మురిళీ దివి 500 రూపాయల దగ్గరే ఆగిపోయేవారు. ఇలాంటి ఆదర్శవంతమైన సక్సస్‌ఫుల్‌ స్టోరీస్‌ చదివినప్పుడైనా మనలో కాస్త మార్పు వస్తే చాలు కదా!

Read more RELATED
Recommended to you

Latest news