టాలెంట్ అనేది ఒక్కో రకంగా ఉంటుంది. కానీ ఆ టాలెంట్ మాత్రం ఉన్నత శిఖరాల్ని అందుకునేలా చేస్తుంది. ఆ టాలెంట్ ని ఉపయోగించి కష్టపడితే లైఫ్ లో కచ్చితంగా సక్సెస్ అవుతాం. టాలెంట్ ఉంటే ఉంటే ఎలాంటి రంగంలో అయినా అఖండమైన విజయం సాధించవచ్చు అని నిరూపించింది తెలంగాణ అమ్మాయి.
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌కు చెందిన ఆశ్రితకి ఉన్న టాలెంట్ ఆమె చదువు. ఆ చదువుతోనే ఆమె నేడు సక్సెస్ అయ్యి సాటి యువతకు ఆదర్శంగా మారింది. ఆమెది ఓ సాధారణ వ్యవసాయ కుటుంబం. తన తండ్రి ఓ మామూలు రైతు కాగా, తల్లి గృహిణి. చిన్నప్పటి నుంచి కూడా చదువులో ఆశ్రీత చాలా చురుగ్గా ఉంటుంది. ఇంట్లో తన తల్లిదండ్రులు పడే కష్టం చూసి ఎలాగైనా బాగా కష్టపడి చదువుకొని మంచి ప్యాకేజీ గల ఉద్యోగం తెచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇందుకోసం తనకు ఏకంగా ప్రతిష్టాత్మకమైన ఇస్రోలో ఉద్యోగం వచ్చినా కూడా తాను అనుకున్న లక్ష్యాన్ని మాత్రమే ఆమె ఎంచుకుంది. బీటెక్ కంప్లీట్ అవ్వగానే చాలామంది కూడా ఎక్కువగా తాము చదివిన బ్రాంచ్ తో సంబంధం లేకుండా సాఫ్ట్‌వేర్ రంగాన్ని ఎంచుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఈమె మాత్రం అందుకు భిన్నంగా హార్డ్‌వేర్ రంగాన్ని సెలెక్ట్ చేసుకుంది. మంచి సాఫ్ట్‌వేర్ జాబ్ ఈజీగా వచ్చే అవకాశం ఉన్నా కానీ దానిని కూడా వద్దనుకొని ఐఐటీ, ఐఐఎస్‌సీల్లో ఎంటెక్ చేయాలని ఆమె గోల్ పెట్టుకుంది.
అందుకు తగ్గట్లే బీటెక్ కంప్లీట్ అవ్వగానే 2021లో గేట్ పరీక్ష రాసింది. దానిలో ఆమెకు 3వేల ర్యాంకు వచ్చింది. ఆ ర్యాంకుతో ఏదో విధంగా ఎంటెక్ చేసేద్దాం అని అనుకోలేదు ఆశ్రీత. తాను అనుకున్నట్టుగా ప్రతిష్టాత్మక టాప్ కాలేజీల్లోనే ఎంటెక్ విద్యాని కంప్లీట్ చేసి ఉద్యోగం సాధించాలని గోల్ పెట్టుకుంది. దీంతో వచ్చిన సీటును కూడా వదులుకొని ఓ కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయి మరోసారి గేట్ పరీక్షని రాసింది. చివరకి ఆమె కష్టానికి తగ్గట్లుగానే ఆల్ ఇండియాలో 36వ ర్యాంకుని సొంతం చేసుకుంది. తాజాగా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఏడాదికి 52 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించి నేటి యువతకి ఆదర్శంగా నిలిచింది.