ది గ్రేట్‌ విప్రో చైర్మ‌న్‌ అజీం ప్రేమ్‌జీ .. రూ.1.45 ల‌క్ష‌ల కోట్లు సామాజిక సేవకే..!

విప్రో చైర్మ‌న్ అజీం ప్రేమ్‌జీ త‌న కంపెనీలో త‌న పేరిట ఉన్న షేర్ల‌లో 34 శాతం షేర్ల‌ను సామాజిక సేవా కార్య‌క్ర‌మాల కోసం ఉప‌యోగిస్తాన‌ని ఈ మ‌ధ్యే స్ప‌ష్టం చేశారు. ఆ షేర్ల విలువ దాదాపుగా రూ.52,750 కోట్లు.

స‌మాజంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల మ‌ధ్య జీవిస్తున్న మ‌నం.. ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాం అనేది ముఖ్యం కాదు. అందులో నుంచి పేద‌వారికి ఎంత స‌హాయం చేస్తున్నామ‌నేదే ముఖ్యం. అలాంటి వారే ప్ర‌జ‌ల‌చే మ‌న్న‌న‌లు పొందుతారు. మ‌నం ఎంత సంపాదించినా స‌రే.. అందులో నుంచి పేద‌ల‌కు స‌హాయం చేయ‌క‌పోతే మ‌నం ఎంత సంపాదించినా వృథాయే. న‌లుగురికి ఉప‌యోగ‌ప‌డ‌ని సొమ్ము ఎవ‌రి వ‌ద్ద ఎన్ని వేల కోట్లు ఉన్నా వేస్టే… అవును, నిజ‌మే. స‌రిగ్గా ఇలా అనుకున్నారు కాబ‌ట్టే.. విప్రో చైర్మ‌న్ అజీం ప్రేమ్‌జీ త‌న ఆస్తిలో ఏకంగా 67 శాతాన్ని పేద‌ల కోసం ఉప‌యోగిస్తున్నారు. కరోనా మహమ్మారితో పోరాటంలో తన వంతుగా  విప్రో, అజీం ప్రే౦ జీ ఫౌండేషన్ 1125 కోట్ల రూపాయల సాయం చేసింది.

విప్రో చైర్మ‌న్ అజీం ప్రేమ్‌జీ త‌న కంపెనీలో త‌న పేరిట ఉన్న షేర్ల‌లో 34 శాతం షేర్ల‌ను సామాజిక సేవా కార్య‌క్ర‌మాల కోసం ఉప‌యోగిస్తాన‌ని ఈ మ‌ధ్యే స్ప‌ష్టం చేశారు. ఆ షేర్ల విలువ దాదాపుగా రూ.52,750 కోట్లు. దీంతో ఆయ‌న ఆస్తిలో 67 శాతం ధ‌నాన్ని సామాజిక సేవా కార్య‌క్ర‌మాల కోసం వినియోగిస్తున్న‌ట్లు అవుతుంది. ఆ మొత్తం సొమ్ము విలువ అక్ష‌రాలా రూ.1.45 ల‌క్ష‌ల కోట్లు. అవును, షాకింగ్‌గా ఉన్నా ఇది నిజ‌మే.

అజీం ప్రేమ్‌జీ తాను స్వ‌యంగా స్థాపించిన అజీం ప్రేమ్‌జీ ఫౌండేష‌న్‌కు పైన చెప్పిన స‌ద‌రు మొత్తం విరాళంగా అందుతుంది. అంతేకాదు ఈ ఫౌండేష‌న్‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా 150 కి పైగా వివిధ ఆర్గ‌నైజేష‌న్లు త‌మ వంతు సేవ‌ల‌ను అందిస్తున్నాయి. ఇక ఈ ఫౌండేష‌న్ ముఖ్య ఉద్దేశ్యం.. పేద‌ల‌కు సరైన విద్య‌, వైద్యం, ఆహారం అందించడ‌మే. ఈ క్ర‌మంలో విప్రో ద్వారా ఆర్జించే లాభాల్లో మొత్తం 67 శాతం సొమ్మును ఈ ఫౌండేష‌న్ సేవా కార్య‌క్ర‌మాల కోసం ఉప‌యోగించ‌నున్నారు.

అజీం ప్రేమ్‌జీ నిజానికి దేశంలోని ధ‌న‌వంతుల్లో రెండో స్థానంలో ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌నకు చిన్న‌ప్ప‌టి నుంచి సేవా భావం ఎక్కువ‌. గాంధీ ఆశ‌యాల‌ను ఆయ‌న అనుస‌రిస్తుంటారు. అలాగే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌, ప్ర‌పంచంలోని అత్యంత ధ‌న‌వంతుల్లో అగ్ర స్థానంలో ఉన్న వారెన్ బ‌ఫెట్‌ల పిలుపుమేర‌కు అజీం ప్రేమ్‌జీ సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో భాగ‌స్వాములు అవుతున్నారు. ధ‌న‌వంతులు తాము సంపాదించే దాంట్లో క‌నీసం 50 శాతం వ‌ర‌కు అయినా సేవా కార్య‌క్ర‌మాల కోసం ఉప‌యోగించాల‌నేది వీరి ఆశ‌యం. అందుకు అనుగుణంగానే అజీం ప్రేమ్‌జీ అంత భారీ మొత్తం సొమ్మును విరాళంగా ఇచ్చి త‌న దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆయ‌న బాట‌లో మ‌రింత మంది న‌డిస్తే ఇంక దేశంలో స‌మ‌స్య‌లు ఎందుకు ఉంటాయి చెప్పండి.. ఏది ఏమైనా అజీం ప్రేమ్‌జీ చేస్తున్న సేవ‌కు ఆయ‌న‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!