కరోనా సుడిగుండంలో చిక్కుకున్న స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ..ఇప్పట్లో కోలుకోగలరా ..?

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం ఎంత దారుణంగా పడిందో ప్రత్యక్ష్య సాక్ష్యాలు కళ్ళ ముందు చాలా కనిపిస్తున్నాయి. లక్షల్లో మరణాలు, వేలకోట్ల ఆర్ధిక సమస్యలు … సామాన్యుడి దగ్గర నుంచి కోట్లకి అధిపతి అయిన వాళ్ళ వరకు ఊహించనంతగా ప్రభావం చూపించింది ఈ కరోనా మహమ్మారి. ఈ నేపథ్యంలో సౌత్, నార్త్ .. తో పాటు హాలీవుడ్ సినీ పరిశ్రమ కూడా అగాధం లోకి వెళ్ళిపోయింది. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్స్ మీద కరోనా ప్రభావం ఎక్కువగా పడింది. అలాంటి వాళ్ళలో ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ముందు ఉండటం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అవుతోంది.

 

నిర్మాత దిల్ రాజు కి గత కొంతకాలంగా సినిమాల పరంగా ఇండస్ట్రీలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఆ వెనకాలే వరుసగా రెండు మూడు సినిమాలు భారీ డిజాస్టర్స్ గా మిగులుతున్నాయి. అంతేకాదు ఆయన డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలు అంతే దారుణంగా దెబ్బ తీస్తున్నాయి. నిర్మాతగా చిన్న సినిమాలు తీసిన కూడా దిల్ రాజు కి నిరాశే మిగిలుతుంది. కోలీవుడ్ సినిమాని రీమేక్ చేస్తే కనీసం సమంత కోసం థియోటర్స్ కి వచ్చినవాళ్ళు కూడా లేకపోవడం ఆశ్చర్యకరం. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మిస్తున్న బాలీవుడ్ హిట్ సినిమా రీమేక్ వకీల్ సాబ్ ని భారీగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాతో పాటు దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి భారీ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ నైజాం పంపిణీ హక్కులు భారీ మొత్తానికి దక్కించుకున్నారు. లాభ నష్టలాతో సంబంధం లేకుండా ఇద్దరు టాప్ స్టార్స్ తో పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారన్న ఒకే ఒక్క కారణంతో దిల్ రాజు అందరితో పోటీ పడీ నైజాం పంపిణీ హక్కులు సొంతం చేసుకున్నారు. అయితే కరోనా చూపించిన తీవ్ర ప్రభావంతో ఇప్పుడు మొత్తం మార్కెట్ కుదేలైంది.

ఈ నేపథ్యంలో దిల్ రాజు .. రాజమౌళి, నిర్మాత డివివి దానయ్యతో చర్చలు జరుపుతున్నారట. ముందుగా చేసుకున్న ఒప్పందానికి తీసుకోలేనని మళ్ళీ డీల్ సెట్ చేసుకుందామని ప్రతిపాదన తెచ్చారట. అయితే సినిమా రిలీజ్ ఇంకా చాలా సమయం ఉండటంతో రాజమౌళి, దానయ్య దిల్ రాజు కి ఇంకా ఏమీ సమాధానమివ్వలేదని తెలుస్తుంది. కాని దిల్ రాజు మాత్రం ఇటు వకీల్ సాబ్, అటు ఆర్.ఆర్.ఆర్ విషయంలో బాగా ఇరుక్కుపోయినట్టు చెప్పుకుంటున్నారు. ఇక సరిలేరు సినిమా విషయంలో కూడా దిల్ రాజు కి అనుకున్నంత లాభాలు రాలేదన్న సంగతి తెలిసందే.

Read more RELATED
Recommended to you

Latest news