ఇంట్లోనే డెయిరీ.. పాల వ్యాపారం చేస్తూ నెల నెలా రూ.ల‌క్ష‌లు సంపాదిస్తోంది..!

-

స‌రిగ్గా ఆలోచ‌న చేయాలే గానీ ఎవ‌రైనా ఏదైనా వ్యాపారం చేసి రూ.ల‌క్ష‌లు సంపాదించ‌వ‌చ్చు. కొద్దిగా క‌ష్ట‌ప‌డితే చాలు, నెల నెలా క‌చ్చిత‌మైన ఆదాయం పొంద‌వ‌చ్చు. సరిగ్గా ఆమె కూడా అలాగే అనుకుంది. కాబ‌ట్టే ఇంట్లోనే డెయిరీ పెట్టి పాల వ్యాపారం చేస్తూ నెల‌కు రూ.3.50 ల‌క్ష‌ల‌ను సంపాదిస్తోంది. ఆమే గుజ‌రాత్‌కు చెందిన నావ‌ల్‌బెన్ ద‌ల్సంగ్‌భాయ్ చౌద‌రి.

woman earning in lakhs per month with small dairy business at home

గుజ‌రాత్‌లోని బ‌న‌స్కంత జిల్లా నగ‌న గ్రామానికి చెందిన నావ‌ల్‌బెన్ వ‌య‌స్సు 62 ఏళ్లు. అయిన‌ప్ప‌టికీ ఆమె పాల‌వ్యాపారంలో ఆరి తేరింది. ఇంట్లోనే చిన్న డెయిరీని ఓపెన్ చేసింది. నెమ్మదిగా పాల వ్యాపారాన్ని విస్త‌రించింది. దీంతో ప్ర‌స్తుతం ఆమె ద‌గ్గ‌ర 80 గేదెలు, 45 ఆవులు ఉన్నాయి. వాటి కోసం 15 మంది నిత్యం శ్ర‌మిస్తుంటారు. వారికి ఈ డెయిరీ వ‌ల్ల ఉపాధి ల‌భిస్తోంది. ఇక 2019లో నావ‌ల్‌బెన్ త‌న డెయిరీ ద్వారా రూ.87.95 ల‌క్ష‌ల విలువైన పాల‌ను విక్ర‌యించ‌గా ఈసారి రూ.1.10 కోట్ల విలువైన పాల‌ను అమ్మింది. 2019 క‌న్నా 2020లో ఆమె మ‌రింత ఎక్కువ పాల‌ను విక్ర‌యించ‌డం విశేషం.

కాగా ఆమె ఈ రంగంలో సాధించిన ప్ర‌గ‌తికి ఆమెకు ప‌లు అవార్డులు కూడా ల‌భించాయి. ల‌క్ష్మి పేరిట రెండు అవార్డుల‌ను ఆమె సాధించింది. అలాగే ఉత్త‌మ ప‌శుపాల‌క్ అవార్డును ఆ జిల్లాకు పొందింది. ఆమె త‌న‌లాంటి ఎంతో మంది మ‌హిళ‌ల‌కు ఆద‌ర్శంగా నిలుస్తోంది. స్వ‌యం ఉపాధి ద్వారా ఒక్కో మెట్టు ఎదుగుతూ ఎలా రాణించ‌వ‌చ్చో ఆమె నిరూపించింది.

Read more RELATED
Recommended to you

Latest news