పీఎఫ్‌ఆర్డీఏ కొత్త సేవలు… వివరాలు ఇవే…!

నేషనల్ పెన్షన్ సిస్టమ్ సబ్‌స్క్రైబరస్ కి తీపి కబురు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ అందిస్తోంది. వీటిల్లో నేషనల్ పెన్షన్ సిస్టమ్ NPS కూడా ఒకటి. కేంద్రం ఇప్పుడు కొత్త సర్వీసులని తీసుకు రావడం జరిగింది. వివరాల్లోకి వెళితే… ఎన్‌పీఎస్ స్కీమ్ ‌లో చేరిన వారు ఇక పై ఆన్‌లైన్ ‌లోనే స్కీమ్ నుంచి బయటకు వచ్చేయవచ్చు. ఇంతకు ముందు అయితే సబ్‌స్క్రైబర్లు ఎన్‌పీసీ సెంటర్‌ కి వెళ్లి స్కీమ్ నుంచి బయటకి వచ్చే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆన్‌లైన్ ‌లో నుండి బయటకి వచ్చేయచ్చు.

ఎన్‌పీఎస్ స్కీమ్‌లో చేరిన వారు సెంట్రల రికార్డ్ కీపింగ్ ఏజన్సీ CRA సిస్టమ్‌లోకి లాగిన్ అవ్వాలి. ఐడీ, పాస్‌వర్డ్‌ తో లాగిన్ అయ్యి స్కీమ్ నుంచి ఎగ్జిట్ అవ్వొచ్చు. ఆన్‌లైన్‌ లో ఓటీపీ లేదా ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ద్వారా ఎన్‌పీఎస్ నుంచి బయటకి వచ్చేయొచ్చు. ఇంట్లో నుండే దీని నుండి ఎగ్జిట్ అవ్వచ్చు అని తెలియజేయడం జరిగింది. దీని కోసం మీరు ఆన్‌లైన్‌ లోనే ఎగ్జిట్ రిక్వెస్ట్ పెడితే సరిపోతుంది.

ఇది ఇలా ఉండగా కేవైసీ, విత్‌ డ్రాయెల్ డాక్యుమెంట్ వంటి వాటిని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే సరిపోతుంది. గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే…? ఆన్‌లైన్‌ లోనే ఎన్‌పీఎస్ స్కీమ్ నుంచి వైదొలగాలని భావించి మీరు రిక్వెస్ట్ పెట్టుకుంటే రూ.125 నుంచి రూ.500 వరకు చార్జీ చెల్లించాల్సి ఉంటుంది.