పండుగ పూట విషాదం.. ఘోర రోడ్డు ప్రమాదం !

Join Our COmmunity

ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువయి పోయాయి. తాజాగా కరీంనగర్ వరంగల్ మధ్య ఉన్న జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వెళ్తున్న ఆర్టిసి బస్సులు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో అందులో ఉన్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో క్రాంతి పండుగకు సొంత ఊర్లకు వెళుతున్న ప్రయాణికులు గాయపడ్డారు.

రెండు ఆర్టీసీ బస్సులను నడుపుతున్న ఇద్దరు డ్రైవర్లు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని క్షతగాత్రులు చెబుతున్నారు. పైగా పొగమంచు కూడా భారీ ఎత్తున ఉండడంతో ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఈ ప్రమాదంలో 24 మందికి తీవ్ర గాయాలు కాగా అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారందరినీ ఆసుపత్రులకు తరలించారు. 

TOP STORIES

సలాం.. మేజర్ మోహిత్ శర్మ..!

మేజర్ మోహిత్ శర్మ.. 19978 జనవరి 13వ తేదీన హర్యానాలోని రోహ్ తక్ గ్రామంలో జన్మించారు. ఇతని తల్లిదండ్రులు రాజేంద్రప్రసాద్, సుశీల. మేజర్ మోహిత్ శర్మను...
manalokam telugu latest news