చాలా మందికి పెంపుడు జంతువులు అంటే ఇష్టం ఉంటుంది.. అందుకే వాటికి తమ కుటుంబ సభ్యుల తో సమానంగా చూసుకుంటారు. మనుషులకు కుక్కలకు మంచి అనుబంధం ఉన్న నేను సంగతి తెలిసిందే..ఒకసారి కుక్క ఎవరితోనైనా స్నేహం చేస్తే, అతను చనిపోయే వరకు ఆ వ్యక్తిని విడిచిపెట్టదు.ఒక ముద్ద వేస్తే విశ్వాసంగా ఉంటుందన్న విషయం తెలిసిందే..అందుకే ఈరోజుల్లో జనాలు మనుషుల కన్నా కూడా జంతువులను ఎక్కువగా ఇష్ట పడుతున్నారు..
నగరాల్లో, ప్రజలు తమ ఇళ్ల భద్రత కోసం కూడా కుక్కలను పెంచుతుంటారు. కుక్కలు ఈ బాధ్యతను అత్యంత చిత్తశుద్ధితో నిర్వహిస్తాయి. కానీ, వాటిని పోషించే ఖర్చును యజమానులు భరించాల్సి ఉంటుంది. చాలా కుక్కల ధర చాలా తక్కువగా ఉంటుంది. కానీ, చాలా కుక్కల నిర్వహణ మాత్రం ఎక్కువగా ఉంటుంది. తాజాగా ఇటువంటి కుక్క కథ ఒకటి చర్చలకు దారి తీసింది. ఆ కుక్క చాలా అరుదైన కుక్క దానికి అయ్యే ఖర్చు మాటల్లో చెప్పలేనిది.
ఈ కుక్క తాగే నీళ్ల కోసం ప్రతి రోజుకు రూ. 4000 లను ఖర్చు చేస్తున్నాడు..ఇలా నెలకు భారీగానె ఖర్చు చేస్తున్నాడు.ఈ కుక్క బాటిల్ వాటర్ మాత్రమే తాగుతుంది. ఆంగ్ల వెబ్సైట్ మిర్రర్ ప్రకారం, లిజ్జీ కుక్క హెన్రీ ప్రతి వారం 12 బాటిళ్ల నీటిని తాగుతుంది. దీని కోసం లిజీ ప్రతి వారం 1000 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలా కాదని పొరపాటున దాని ముందు కుళాయి నీటిని ఉంచితే, వాటిని కనీసం ముట్టుకోకపోవడమే కాక, అటువైపు కూడా చూడదట..దానికి ప్రత్యేకంగా లక్షలు పోసి మంచాన్ని కూడా చేయించాడు.. వామ్మో ఎంత ప్రేమ ఉంటే కుక్క కోసం లక్షలా..అని నెటిజన్స్ కామెంట్లు కూడా చేస్తున్నారు.