అమరావతి : టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అవినీతికి చట్టబద్దత కల్పించిన సీఎం జగన్ అవినీతి నిర్మూలనపై యాప్ ప్రారంభించటం హాస్యాస్పదమని మండిపడ్డారు. తీవ్రవాద సంస్థలు ప్రవచనాలు చెప్పినట్లు జగన్ యాప్ విడుదల ఉందని ఫైర్ అయ్యారు.
మద్యం, ఇసుక ద్వారానే జగన్ అవినీతి సంపాదన రూ. 5 వేల కోట్లు అని.. ఈ కుంభకోణంపై ఏ యాప్ లో ఫిర్యాదు చేయాలో జగనే చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్సుగా ఉన్న వ్యక్తి సహచర అవినీతి పరులైన విజయసాయి, నిరంజన్ రెడ్డిలను చట్ట సభలకు పంపాడని.. అవినీతి పరులకు పదవులిస్తూ.. అవినీతి నిర్మూలన మంత్రులకు వర్తించదన్నట్లుగా జగన్ వ్యవహారం ఉందన్నారు. నిజమైన అవినీతిపరుల్ని రక్షిస్తూ ఉద్యోగుల పై కక్ష సాధించేందుకే యాప్ విడుదల చేశారు… వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల అవినీతిపై ఫిర్యాదుకు మరో యాప్ పెట్టే దమ్ము సీఎంకు ఉందా ? అని నిలదీశారు.