కరోనా వైరస్.. ఈ పేరు వింటేనే భయంతో వణుకుతున్నారు. మొన్నటి వరకు చైనా, చైనా వెలుపల ఆసియా, ఐరోపా దేశాలను గజగజలాడించిన కరోనా ఇప్పుడు ఇండియాలో కూడా ఎంటర్ అయ్యింది. ఈ వైరస్ సోకిన వ్యక్తికి జలుబు, జ్వరం, దగ్గు, ఛాతీలో నొప్పి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. తర్వాత తీవ్రమైన న్యుమోనియాకు దారితీసి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో కరోనా అంటేనే ఆమడ దూరం పరిగెడుతున్నారు. ఇక రోజురోజుకీ ఈ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొంతమందికి కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. కరోనా కారణంగా లిథుయానియాలో ఓ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తన భార్యకు కరోనా వైరస్ సోకిందని అనుమానంతో శాడిస్ట్ భర్త ఆమెను బాత్‌రూమ్‌లో పెట్టి లాక్ చేశాడు. పాపం.. ఎంత చెప్పినా కూడా వినకుండా బయటికి రానివ్వకపోవడంతో భర్త నిర్వాకాన్ని ఆమె ఎలాగోలా పోలీసులకు తెలియజేసింది. చివరకు విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆమెను బాత్రూం నుంచి బయటికి తీసుకొచ్చి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో కరోనా సోకలేదని నిర్ధారణ అయింది.
కాగా, కరోనా ప్రభావం మొదలైన తర్వాత ఇటలీ నుంచి వచ్చిన ఓ వ్యక్తితో ఆమె మాట్లాడిందని భర్త తెలుసుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ తారాస్థాయికి చేరుకుంది. వెంటనే అతడిలో అనుమానాలు మొదలయ్యాయి. అయితే భార్యకు కరోనా సోకినట్లు డాక్టర్లకు చెప్పడమే కాకుండా ఆమె ఎక్కడికీ వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మెడికల్ టెస్టులు నిర్వహించాలని తెలిపాడు. దీంతో సదరు వ్యక్తి ఆమెను బాత్‌రూమ్‌లో లాక్ చేశారు. ప్రస్తుతం ఇతడి భాగోతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.