అశ్లీల చిత్రాల్లో నటించమని బలవంతం.. 20ఏళ్ళు శిక్ష విధించిన కోర్టు

-

కాలిఫోర్నియాకి చెందిన పోర్న్ వెబ్ సైట్ కి పనిచేసే ఒకానొక నిర్మాత కటకటాల వెనక్కు వెళ్ళాడు. తన వద్దకు వచ్చే అమ్మాయిలను అశ్లీల చిత్రాల్లో నటించమని బలవంతం చేసినందుకు ఈ శిక్ష పడింది. ఈ మేరకు సోమవారం తీర్పు వచ్చింది. 20సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించారు. 31సంవత్సరాల రూబెన్ ఆండ్రూ గార్షియా అనే గర్ల్స్ డు పోర్న్ అనే వెబ్ సైటుకి యాక్టర్ గా, నిర్మాతగా పనిచేస్తూ వస్తున్నాడు. 2013 నుండి 2017వరకు ఈ వెబ్ సైటుకి పనిచేసాడు.

ప్రతివాదుల ప్రకారం ఈ గార్షియా అనే వ్యక్తి యాడ్స్ లో నటించే మహిళలను అశ్లీల చిత్రాల్లో నటించమని ప్రోత్సహించేవాడు. ఈ చిత్రాలు ఇంటర్నెట్ లో లభించవని, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి డీవీడీల రూపంలో వెళ్తాయని కబుర్లు చెప్పేవాడు. కానీ అంతా అయిపోయాక ఈ వీడియోలను ఇంటర్నెట్ లో పోస్ట్ చేసేవాడు. ఉచితంగా పోర్న్ వీక్షణాన్ని అందించే అనేక వైబ్ సైటుల్లో అందుబాటులో ఉంచడం వల్ల మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చేవని వాదించారు. ఈ వ్యవహారంలో కొంతమంది మహిళలను బలవంతం చేసేవారని అన్నారు.

దీని కొరకు విమాన టికెట్లు క్యాన్సల్ చేయడం, కెమెరా పరికరాలు అడ్డు పెట్టి హోటల్ గదుల నుండి బయటకు వెళ్ళకుండా చేయడం చేసేవాడని కోర్టుకి విన్నవించారు. అంతా విన్న కోర్టు, గార్షియాకి 20ఏళ్ళ పాటు శిక్ష విధించింది. మహిళలను బలవంతం చేయడమే కాకుండా మానసికంగా ఇబ్బందులకు గురి చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news