తమ్ముడి కోసం జీవితాన్నే త్యాగం చేసిన అక్క… ఈ కథ వింటే కన్నీరు పెట్టడం ఖాయం…!

-

ఆమె పేరు వూ హుయాన్. చిన్న వయసులోనే తల్లి చనిపోయింది… స్కూల్ కి వెళ్ళగానే తండ్రి చనిపోయాడు. ఆమె వయసు ప్రస్తుతం 24 ఏళ్ళు… ఇన్నేళ్ళు ఆమె తన బంధువుల ఇంట్లోనే తన తమ్ముడుతో కలిసి ఉంటుంది. తమ్ముడితో కలిసి ఆ అమ్మాయి చైనాలోని గుయాంగ్ నగరంలో ఉంటూ చదువుకుంటుంది. గత నెల మొదటి వారంలో ఆమె ఆరోగ్యం పూర్తిగా పాడైంది… డబ్బులు లేకపోయినా ఏదోలా ఆస్పత్రికి వెళ్ళింది. అప్పుడు ఆమెకు శ్వాస తీసుకోవడమే కష్టంగా ఉండటంతో పాటు గుండె సంబంధిత వ్యాధితో కూడా బాధపడుతుంది.

ఆమె బరువు కూడా కేవలం 20 కేజీలు మాత్రమే ఉంది. దీనితో వైద్యులు ఆమెను వివరాలు అడిగారు. ఆమె చెప్పిన విషయాలు విని కన్నీరు పెట్టడం వారి వంతు అయింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన తమ్ముడికి వైద్యం చేయించడానికి, తాను చదువుకోవడానికి డబ్బులు అవసరమని అందుకే కేవలం తాను రోజు 22 రూపాయలతో బ్రతికాను అని… కాస్త అన్నం పచ్చి మిర్చి తింటూ ఇన్నాళ్ళు గడిపానని ఆమె చెప్పడంతో వైద్యులు ఈ విషయాన్ని మీడియా దృష్టికి తీసుకువెళ్ళారు. చైనాలో పత్రికల్లో అన్నింట్లో ఇదే ప్రధాన వార్త అయింది.

దీనితో ఆమె కోసం 80 లక్షలను విరాళంగా ఇచ్చారు దాతలు. తన బంధువులు ఇచ్చే మూడు వేల రూపాయలను తన తమ్ముడి వైద్యం కోసం, అతని వైద్య చికిత్స కోసం ఖర్చు చేయడంతో ఆమె గత అయిదేళ్ళు గా రోజుకి కేవలం 22 రూపాయలతో బ్రతుకుతుందని తెలిసి చైనాలో జనంలో కన్నీరు పెట్టారు. ఇప్పుడు ఆమె ఆరోగ్యానికి కూడా ఆస్పత్రి వైద్యులు డబ్బులు తీసుకోవడం లేదట. ఇక ఆమె చదువుకునే కళాశాలపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఆమెను కనీసం పట్టించుకోకుండా ఇన్నాళ్ళు వాళ్ళు ఏం చేసారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news