మన వంట గదిలో అల్యూమినియం వస్తువుల వాడకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చివరికి పాలు కాయడానికి కూడా దానినే ఎక్కువగా వినియోగిస్తూఉంటాం. ఈ విషయంలో పరిశోధకులు, చెప్పినా మనం మాత్రం వినే సాహసం మాత్రం ఏ కోశానా చేయం అనేది వాస్తవం. అసలు వాటి వలన సమస్యలు వస్తాయా …? అంటే అవుననే వినపడుతుంది. రకరకాల జబ్బులు రావడానికి అల్యుమినియం పాత్రలే కీలక పాత్ర పోషిస్తాయని అంటున్నారు. సుమారుగా వందేళ్ల క్రితం భారత దేశ స్వతంత్ర పోరాట యోధులను అనారోగ్యం పాలు చేయడానికిగానూ,
వాళ్ళను బంధించి ఉంచిన జైల్లో ప్రప్రధమంగా జైళ్ళల్లో అల్యుమినియం పాత్రలను ప్రవేశ పెట్టారు. ఈ పాత్రలలో వంట చేసినా, వండినదానిని నిలువ చేసినా ఆ పదార్థాలు క్రమక్రమంగా విష తుల్యం ( స్లో పాయిజన్ ) అవుతాయి. క్రమంగా వారికి బి.పి., షుగర్, కీళ్ళనొప్పులు, కాలేయ సమస్యలు, రకరకాల కాన్సర్ లు మొదలవుతాయట. స్వతంత్ర సమరయోధులను అనేక జబ్బుల బారిన పడేలా చేసి వారిని నిర్వీర్యం చేయడానికి గానూ ఈ వ్యూహంతో వాళ్ళు ముందుకి వెళ్లే వాళ్ళని చాలా మంది అనారోగ్యం బారిన పడ్డారని కొందరు చెప్తూఉంటారు . పరిశోధనల్లో కూడా ఈ విషయం స్పష్టమైందట.
ఇక్కడ అసలు ప్రమాదకర విషయం ఏంటీ అంటే… అప్పుడు అనారోగ్యం కోసం ఉపయోగించిన పాత్రలను నేడు భారతీయులు తమ జీవనం కోసం ఉపయోగించడం ఆందోళన కలిగిస్తుంది. వాటి వలన ఎన్ని నష్టాలు ఉన్నాయని చెప్పినా ప్రజల్లో మాత్రం ఏ కోశానా మార్పు రావడం లేదు. జీవితాన్ని వేధించే వ్యాధులకు వాటి వాడకమే ప్రధాన కారణమని చెప్పినా సరే ప్రజల్లో మాత్రం మార్పు వచ్చే అవకాశం కనపడటం లేదు. షుగర్, కీళ్ళ నొప్పులు, లివర్ వ్యాదులు, కిడ్ని సమస్యలు, గుండె సమస్యలు మన దేశంలో అనూహ్యంగా పెరిగిపోయాయి. వీటిల్లో అల్యూమినియం పాత్రల పాత్రే ఎక్కువగా ఉందని అంటున్నారు.