ఈ కాయిన్ విలువ రెండు కోట్లు..!

నిధి కోసం వెతుకుతున్న ట్రెషర్ హంటర్ మెటల్ డిటెక్టర్ సహాయంతో కాయిన్ ని కనుక్కోవడం జరిగింది. యునైటెడ్ కింగ్డమ్ Wiltshire Hampshire border లో ఈ కాయిన్ (Anglo-saxan coin) ఆ ట్రెషర్ హంటర్ కి దొరికింది. అయితే ఈ గోల్డ్ కాయిన్ విలువ వేలల్లో, లక్షల్లో కాదు ఏకంగా రెండు కోట్ల వరకూ ఉంటుంది అని చెప్తున్నారు.

ఈ గోల్డ్ కాయిన్ బరువు 4.82 గ్రాములు. Ecgberht, King of the west saxons 802 మరియు 839 మధ్య ఇది మట్టిలో ఇరుక్కుపోయింది. దీనితో ఆ కాయిన్ ని పొందలేకపోయారు. చారిత్రక నాణాలకి వేలంపాట లో తప్పకుండా ఎక్కువ డబ్బులు వస్తాయి. అయితే సెప్టెంబర్ 8న వేలంపాట కోసం షెడ్యూల్ చేయడం జరిగింది. మీడియా రిపోర్టు ప్రకారం గత ఎనిమిది సంవత్సరాల నుండి ఈ కాయిన్ కోసం అతను వెతుకుతున్నాడు. ఈ కాయిన్ కోసం Wiltshire Hampshire బోర్డర్ లో తిరుగుతున్నాడు. ఈ కాయిన్ ని పొందడానికి అతను మెటల్ డిటెక్టర్ సహాయాన్ని కూడా ఉపయోగించుకుని వెతకడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే హఠాత్తుగా మెటల్ ఇండికేటర్ కాయిన్ ని ఐడెంటిఫై చేసింది.

ఆ తర్వాత కాయిన్ ని పొందాడు. అయితే మొదటి తాను కాయిన్ ని పోల్చుకోలేకపోయాడు. అందుకే షర్ట్ బటన్ అనుకున్నాడు. కానీ ఆ తర్వాత గోల్డ్ కాయిన్ అని అతనికి తెలిసింది. కాయిన్ డిపార్ట్మెంట్ అయితే 2020లో ఇది తెలిసే వరకు గోల్డ్ కాయిన్స్ గురించి ఎవరికీ తెలియదని… 2020 లో ఒక కాయిన్ దొరికిన తర్వాత అందరికీ ఈ కాయిన్స్ గురించి తెలిసింది అని అన్నారు. ఈ కాయిన్ నాణ్యమైన బంగారం తో పాటు వెండి మరియు కాపర్ తో ఉంటుంది అని అన్నారు.