వామ్మో… అతడేం డాక్టర్ నమ్మి వస్తే నట్టేట ముంచాడు…

-

ప్రస్తుత రోజుల్లో మహిళల్లో గర్భదారణ సమస్యలు సాధారణంగా వస్తూ ఉన్నాయి. అనేక మంది పెళైన జంటలలో మాతృత్వం అనేది ఒక కళలా ఉంటుంది. మన దేశంలో అయితే చాలా మంది పెళ్లయిన దగ్గరి నుంచి తల్లి ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తుంటారు. కానీ ప్రస్తుత జీవనశైలి వల్ల ఆహారపు అలవాట్ల వలన చాలా మందిలో గర్భస్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. నేటి రోజుల్లో గర్భస్త సమస్యలను అధిగమించేందుకు చాలా మంది జంటలు IVF చికిత్సా విధానాన్ని అవలంభిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల వారు కూడా పిల్లల కోసం IVF చికిత్సా విధానాన్ని అనుసరిస్తున్నారు. దీనినే కొంత మంది డాక్టర్లు అలుసుగా తీసుకుని తమ వ్యాపారం కోసం అమాయక మహిళలను బలి పశువులను చేస్తున్నారు. కెనడాలో జరిగిన విషయాన్ని తెలిస్తే షాక్ కు గురవుతారు. కెనడాలో IVF చికిత్సకు పేరు మోసిన డాక్టర్ బార్విన్ చేసిన మోసం గురించి తలుచుకుంటేనే వామ్మో అని అనిపిస్తుంది. IVF రేటు ఎక్కువగా ఉండడం కోసం, మరియు తన ఆస్పత్రికి మంచి పేరు రావడం కోసం బార్విన్ తన వద్దకు వచ్చిన పేషంట్లకు తన వీర్యంతోనే కాన్పులు చేసినట్లు ఒప్పుకున్నాడు.

బార్విన్ తన సక్సెస్ రేటు కోసమే ఇదంతా చేసినట్లు అభియోగాలున్నాయి. అతడిని కోర్టు దోషిగా నిర్ధారించింది. డార్విన్ ఇలా తన వీర్యాన్నే IVF చికిత్స కోసం వచ్చే పేషంట్లకు ఉపయోగించడాన్ని తెలిసిన మెడికల్ కౌన్సిల్ ఆయన లైసెన్సును క్యాన్సిల్ చేసింది. తర్వాత అతడు కూడా తన మీద వచ్చిన ఆరోపణలను ఒప్పుకున్నాడు. మరో విషయమేంటంటే తాను చేసిన తప్పుకు తాను నష్టపరిహారం చెల్లించేందుకు కూడా బార్విన్ అంగీకరించాడు.

Read more RELATED
Recommended to you

Latest news