హైదరాబాద్‌ లో అరణ్య భవనం..ఎక్కడ ఉందో తెలుసా?

-

అరణ్య అంటే అడవి కదా..మరి హైదరాబాద్ లో అడవి ఎక్కడ ఉంది అనే సందేహం అందరికి రావడం సహజం..ఆగండి..ఆగండి..ఇక్కడే ఉంది అసలు కథ..హైదరాబాద్‌ నగరం మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు వేదిక కానుంది. దేశంలోనే తొలిసారిగా, ఏషియాలో రెండోదిగా హైదరాబాద్‌ నగరంలో వర్టికల్‌ ఫారెస్ట్‌ అపార్ట్‌మెంట్‌ ను త్వరలోనే నిర్మించబోతున్నారు.హైటెక్‌ సిటీ ఈ ప్రతిష్టాత్మక భవనం నిర్మాణ పనులు అతి త్వరలో ప్రారంభం కాబోతున్నాయి..

ఈ అరణ్య భవనం 360 డిగ్రీస్‌ లైఫ్‌ సంస్థ ప్రాజెక్టును నిర్మించనుంది. సమీపంలో మూడు ఎకరాల స్థలంలో ఈ భవనం నిర్మాణ పనులు 2024లో ప్రారంభం కాబోతున్నాయి. ఇందులో మొత్తం 30 అంతస్తులు ఉండగా 25 నివాసాలకు మిగిలిన ఐదు ఫ్లోర్లు పార్కింగ్‌ కోసం కేటాయించనున్నారు. మొత్తంగా ఈ భవంతిలో 288 ప్లాట్స్‌ ఉంటాయని సంభంధిత అధికారులు చెబుతున్నారు.అపార్ట్‌మెంట్‌లో ప్రతీ ప్లాట్‌లో ప్రతీ అంతస్తులో చెట్లు వచ్చేలా ఈ భవనాన్ని డిజైన్‌ చేశారు. చూడటానికి నిలువుగా విస్తరించిన అడవిలా ఈ భవనం కనిపిస్తుంది.

ఇందులో ప్రతీ అపార్ట్‌మెంట్‌లో బాల్కనీలో పళ్ల చెట్లు, బెడ్‌రూమ్‌ దగ్గర సువాసన వెదజల్లే చెట్లు, కిచెన్‌ దగ్గర కూరగాయల మొక్కలు వచ్చేలా భవనం ఉండబోతుంది. నలువైపుల నుంచి గాలి, వెలుతురు ధారళంగా వచ్చేలా చెట్లు పెరిగేందుకు అనువుగా అత్యున్నత టెక్నాలజీ వాడుతూ ఈ భవనం నిర్మించబోతున్నారు.ఆసియాలో చైనాలోని కివీ సిటీలో తొలి వర్టికల్‌ ఫారెస్ట్‌ అపార్ట్‌మెంట్‌ నిర్మాణం జరగింది.అందులో 826 ప్లాట్లు ఉన్నాయట..రెండో భవంతిని హైదరాబాద్‌లో నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు..మొత్తానికి ఈ భవనం ఎలా ఉంటుందా అని హైదరాబాదీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news