దేశ గుర్తింపు కార్డులు పొందిన రోహింగ్యాలు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ పాతబస్తీలో ఇద్దరు రోహింగ్యాలను అదుపులోకి తీసుకున్నారు సౌత్ జోన్ పోలీసులు. తొమ్మిది సంవత్సరాలుగా పాతబస్తీలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న రోహింగ్యాల గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే వారి వద్ద భారతీయ పౌరులకు లభించే పలు రకాల ధ్రువీకరణ పత్రాలు లభ్యమవటం ఆందోళన కలిగించే అంశం.
వారి వద్ద స్వాధీనం చేసుకున్న పత్రాలలో పాస్ పోర్టులు కూడా ఉండటం గమనార్హం. మీ సేవా కేంద్రాల సిబ్బందిని లోబరుచుకొని వారు పలు పత్రాలు పొందినట్లు పోలీసులు గుర్తించారు.
వారి నుండి ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు, పాన్ కార్డులు, మ్యారేజ్ సర్టిఫికెట్, బ్యాంక్ పాస్ బుక్, గ్యాస్ కంపెనీ పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న వీరిని మహ్మద్ హుస్సేన్ అలీ, దిల్ ఆరా సుల్తాన్ అహ్మద్ లు గా పోలీసులు గుర్తించారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.