ఇంట్లో బొద్దింకలు ఎక్కువయ్యాయా..? డోంట్ వర్రీ.. ఇలా చేస్తే పారిపోతాయి..!

-

చాలా మంది ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని ఎన్నో రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. అయినా సరే కొన్ని సమస్యలు అలా తలెత్తుతూనే ఉంటాయి. ఎక్కువ మంది బొద్దింకల వలన ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంట్లో బొద్దింకలు వలన మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ చిన్న చిన్న చిట్కాలని ట్రై చేయండి. అప్పుడు ఈజీగా మీరు బొద్దింకలను తరిమి కొట్టేయొచ్చు.

పీనట్ బట్టర్ ట్రాప్:

ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది చాలా ఈజీ రెమిడీ కూడా. మొదటి ఈజీగా బొద్దింకలను పట్టుకుని ఆ తర్వాత వాటిని చంపేయొచ్చు. దీనికోసం మీరు ఒక పెద్ద పొడవాటి జార్ ని తీసుకోండి పీనట్ బట్టర్ ఒక స్పూన్ తీసి ఆ జార్లో వేయండి. జార్ బయట మీరు కాస్త పెట్రోలియం జెల్లీని అప్లై చేయండి. వాసనకి బొద్దింకలు జార్ మీదకి మీదకి వస్తాయి తర్వాత జార్ లోకి మెల్లగా వెళుతుంటాయి. మీరు దాన్ని మూత పెట్టేయొచ్చు.

వెల్లుల్లి ట్రాప్:

వెల్లుల్లి వాసనకి బొద్దింకలు పారిపోతాయి ఒక పేపర్ కప్ లో కొన్ని వెల్లుల్లిపాయలు చితక్కొట్టి పెట్టండి. దీంతో బొద్దింకలు ఆ ఘాటు అయిన వాసన వలన దూరంగా వెళ్ళిపోతాయి మీరు వంట గదిలో కిరాణా సామాన్లు పెట్టినప్పుడు బొద్దింకలు చేరకుండా ఉండడానికి దీన్ని ట్రై చేయొచ్చు.

ఇలా స్ప్రే చేయండి..

సబ్బు నీళ్లు
వేప నూనె
ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్
మౌత్ వాష్ యూకలిప్టస్ లేదా టీ ట్రీ డ్రాప్స్
నీళ్లు
రబ్బింగ్ ఆల్కహాల్
వీటన్నిటినీ ఒక బాటిల్ లో వేసి ఈ మిశ్రమాన్ని స్ప్రే చేస్తూ ఉండండి ఈ స్ప్రే వలన కూడా చేరవు.

Read more RELATED
Recommended to you

Latest news