తరచూ పీడకలలు వస్తున్నాయా.. ఆ వ్యాధి లక్షణం కావొచ్చు..

-

నిద్రలో ఏవో ఒక కలలు రావడం కామన్‌.. కానీ కొన్నిసార్లు ఒకేరకమైన కల పదే పదే వస్తుంది. కలలు భవిష్యత్తుకు సంకేతాలు అని పెద్దలు అంటారు. మరి అలాంటిది.. మీకు పీడకలలు డైలీ వస్తుంటే.. దాని అర్థం ఏంటి.. ప్రమాదం పొంచి ఉన్నదనా..? సైన్స్‌ ప్రకారం..తరచూ పీడకలలు వస్తున్నాయంటే.. అది భయంకరమైన వ్యాధికి సంకేతం..ఒక వ్యక్తి తన జీవితంలో బలహీనమైన లేదా భయంకరమైన కలలను పదే పదే వస్తుంటే మీరు నైట్ మేర్ డిజార్డర్ బారిన పడినట్టు అర్థం… ఇదొక రకమైన పారాసొమ్నియా. వ్యాధి తీవ్రత ఆధారంగా ఈ రుగ్మత ఆధారపడి ఉంటుంది. వారానికి ఒకటి కంటే తక్కువ సార్లు పీడకలలు వస్తాయి. వారానికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సార్లు పీడకలలు వస్తే రుగ్మత మితం ఉందని అర్థం.

ఈ వ్యాధి లక్షణాలు

చెమటలు పట్టడం
శ్వాస ఆడకపోవడం
గుండె వేగంగా కొట్టుకోవడం
ఆందోళన
మూడ్ స్వింగ్స్
అలసట
నిద్రలేమి
ఏకాగ్రత దెబ్బతినడం
ప్రవర్తనలో మార్పులు

నైట్ మేర్ డిజార్డర్‌కి కారణమేంటి?

పీడకలలు రావడానికి సరైన కారణాలు ఏమిటనేది పరిశోధకులకు కూడా తెలియలేదు. హైపర్‌రౌసల్‌ కారణంగా ఇది సంభవిస్తుందనే భావన ఉంది. ఇది మానసిక స్థితిని మార్చే లక్షణం. దీని వల్ల ఎప్పుడూ చిరాకు, కోపం ఉంటుంది. హైపర్‌రౌసల్‌ నిద్రపోతున్నప్పుడు మెదడులోని కొన్ని ప్రాంతాలను అతిగా చురుగ్గా ఉండేలా చేస్తుంది. దీని వల్ల పీడకలలు వస్తాయి. ఒత్తిడికి గురవుతున్న వాళ్ళు ఎక్కువగా పీడకలలకు ఎక్కువగా గురవుతారు. కొన్ని సార్లు ఇంట్లో, ఆఫీసు పని ఒత్తిళ్లు వల్ల కూడా పీడకలలు వస్తాయి. గాయాలు, శారీరక, లైంగిక వేధింపుల వల్ల కూడా ఈ కలలు రావడం సర్వసాధారణంగా జరుగుతుంది.

నిద్రలేమి మరొక కారణం.

యాంటీ డిప్రెసెంట్ మందులు
రక్తపోటు మందులు
ధూమపానం, మద్యపానం అలవాట్లు కూడా పీడకలలను ప్రేరేపిస్తాయి.

ఈ వ్యాధికి చికిత్స ఉందా?

టాక్ థెరపీ ద్వారా చికిత్స చేస్తారు. బిహేవియర్ థెరపీ (CBT) ఆధారిత చికిత్సలు, ఇమేజరీ రిహార్సల్ థెరపీ (IRT), ఎక్స్పోజర్, రిలాక్సేషన్, రిస్క్రిప్టింగ్ థెరపీ (ERRT) చేస్తారు. పెద్దవారిలో ERRT చికిత్స పీడకల రుగ్మతకు అత్యంత ప్రభావవంతమైన చికిత్సగా అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ సిఫార్సు చేసింది. CBT-ఆధారిత చికిత్సలు పీడకలలు రాకుండా తీవ్రతను తగ్గిస్తాయి. ఈ వ్యాధికి చికిత్స చేయకుండా వదిలేస్తే అది చాలా తీవ్రంగా మారుతుంది. కొన్నిసార్లు.. ఆత్మహత్యకు ప్రయత్నించే ప్రమాదం కూడా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version