ఒక బంధం ఎక్కువ కాలం నిలబడటానికి ఒకే రకమైన ఆసక్తులు కావాలి. పరస్పరం విరుద్ధమైన ఆలోచనలు అభిప్రాయాలు ఉన్నప్పుడు వాళ్లు తమ బంధాన్ని ఎక్కువ రోజులు కొనసాగించలేరు. ముఖ్యంగా డేటింగ్ లో అవతలి వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.
మీరు డేట్ చేయాలనుకుంటే, ఆ బంధాన్ని ఎక్కువ రోజులు కొనసాగించాలి అనుకుంటే.. దానికోసం అవతలి వాళ్ళ అభిప్రాయాలు, నమ్మకాలు తెలుసుకోవాలి. అయితే అది అంత ఈజీ కాదు. దానికోసం వాళ్లను కొన్ని ప్రశ్నలు వేయాలి. ఆ ప్రశ్నలు ఏంటో తెలుసుకుందాం.
నీకు నచ్చే టాపిక్ ఏంటి?
ఈ ఒక్క ప్రశ్నకు అవతలి వారి సమాధానం చాలు.. మీరు వాళ్లతో బంధాన్ని కొనసాగించవచ్చో లేదో తెలియడానికి. వాళ్లకు నచ్చే టాపిక్ మీకు కూడా నచ్చినట్లయితే మీ బంధం కచ్చితంగా ఎక్కువ రోజులు కొనసాగుతుంది.
నీలో నీకు నచ్చే విషయం ఏమిటి?
ఈ ప్రశ్న వల్ల అవతలి వాళ్ళు తమని తాము ఎంతలా ప్రేమిస్తున్నారనే సంగతి మీకు అర్థమవుతుంది. ఒకవేళ వాళ్లను వాళ్ళు అమితంగా ఇష్టపడుతున్నట్లయితే.. వాళ్లు ఎదుటి వాళ్ళని ఎక్కువగా ఇష్టపడలేరు.
కల్చరల్ వాల్యూస్ ఏంటి?
అవతలి వాళ్ళ సాంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులు తెలుసుకున్నప్పుడే.. నీవు వాళ్లతో ఎలా ఉండాలనేది తెలుస్తుంది. వాళ్లు తమ కల్చర్ కి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారనేది తెలిస్తే మంచిది.
నీవు డెవలప్ చేసుకోవాలనుకునే స్కిల్ ఏంటి?
ఇది తెలుసుకోవడం వల్ల అవతలి వాళ్ళు తమ ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారో మీకు తెలుస్తుంది. అసలు ఫ్యూచర్ మీద వాళ్లకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉందనేది తెలుస్తుంది.
నీ గురించి జనాలు తప్పుగా అనుకునే విషయాలు ఏంటి?
దీనివల్ల అవతలి వారిలోని నిజరూపం బయటకు వస్తుంది. తమ గురించి జనాలు అనుకునేది తప్పని, అసలు కారణం ఇదని వాళ్లు చెప్పడం వల్ల వాళ్ళ మనసులోని లోతు తెలుస్తుంది.