ఏటీఎంలో వెయ్యి కొడితే ప‌దివేలు వ‌స్తున్నాయండోయ్‌.. ఎక్క‌డో తెలుసా..?

-

ఇటీవ‌ల కాలంలో ఏటీఎంల వాడ‌కం ఎక్కువ అయిపోయింది. బ్యాంకుల చుట్టూ తిర‌గ‌కుండా ఏటీఎంలో డ‌బ్బులు తీసుకోవ‌డం ఎంతో సులువుగా మారింది. ఇదిలా ఉంటే.. వెయ్యి రూపాయలు తియ్యాలనుకుంటే ఆ ఏటీఎం మిషన్ పది వేల రూపాయలు ఇస్తుంది. అదే పనిగా పదిసార్లు వెయ్యి రూపాయల చోప్పున తీసుంకుంటే ఇగ మీ పంట పండినట్టే. ఇలా కొట్టిన దాని కంటే ఎక్కువ పైసలు వస్తే జనాలు ఊరుకుంటారా? ఆ మిషన్ కాడికి నిలబడి లైన్లు కట్టరా?. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ లో ఈ ఘటన జరిగింది. కమలాపూర్ బస్టాండ్ దగ్గర ఈ మధ్యన కొత్తగా పెట్టిన ఇండియన్ వన్ ఎటిఎం మిషన్ లో నుంచి పైసలు తీసుకునేందుకు పోయిన వారికి పండగే పండగ.

వెయ్యి రూపాయలుతీయాలనుకున్న వాళ్లకు ఆరు వేల నుంచి పదివేల వరకు వచ్చాయి. ఈ ముచ్చట ఆ నోటా ఈ నోటా పడడంతో ఖాళీ అయ్యేదాకా లైన్ లో ఎగబడి మరి ప్రజలు డబ్బులు తీసుకున్నారు. ఈ విష‌యం పోలీసులకు తెలిసి అక్కడికి వచ్చేసరికి డబ్బులు తీసుకున్నవారు అక్కడ ఎవరు లేకుండా పోయారు. ఆ ఏటీఎం మిషిన్ చూసి అధికారులు రిపేరు చేసేవాళ్ళు అక్కడికి వచ్చి మిషన్ విప్పి డబ్బులు చూసుకున్నారు. కానీ అప్ప‌టికే మొత్తం డ‌బ్బు ఖాళీ అయిపోయింద‌ట‌. సాంకేతికంగా సమస్య రావడం తోనే ఇలా జరిగిందని ఏటీఎం అధికారులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news