ఎంత మంచివాడవురా! ఫస్ట్ రివ్యూ..

-

Entha Manchivaadavuraa Movie Review

విడుదల తేదీ : జనవరి 15, 2020

manalokam రేటింగ్ : 2.25 /5

నటీనటులు : కల్యాణ్ రామ్ , మెహరీన్

దర్శకత్వం : సతీష్ వేగేశ్న

నిర్మాత‌లు : శివలెంక ప్రసాద్

సంగీతం : గోపి సుందర్

తెలుగు హీరోలలో సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న హీరో లు చాలామందే ఉన్నారు. దశాబ్దాల కాలం నుంచీ ఇండస్ట్రి లో ఉన్నా పటాస్ – అతనొక్కడే లాంటి సినిమాలు మంచి కమర్షియల్ హిట్ లు ఇచ్చినా ఇప్పటివరకూ స్టార్ డమ్ అనేది తెచ్చుకోలేకపోయాది కల్యాణ్ రామ్. మరి ఈ సినిమా తో ఐనా అతని కోరిక తీరుతుందా అనేది చూడాలి . శతమానమ్ భవతి డైరెక్టర్ సతీష్ వేగేశ్న తీసిన ఎంత మంచివాడవురా సినిమా ట్రెయిలర్ తో ఆకట్టుకుంది. ఒక పక్క అలా వైకుంఠపురములో – సరిలేరు నీకేవ్వరు సినిమా ల విడుదల తో పోటీ నడుస్తుంటే మధ్యలో వచ్చిన ఈ సినిమా ఎంతవరకూ రాణిస్తుంది అనేది చూడాలి.

కథ : చిన్నతనం లోనే తల్లితండ్రులని కోల్పోతాడు బాలు ( కల్యాణ్ రామ్ ) .. స్వతహాగా పైకి వస్తాడు జీవితం లో . షార్ట్ ఫిల్మ్ లు ప్రొడ్యూస్ చేసే మెహరీన్ తో పరిచయం ఏర్పడుతుంది హీరో కి . నెమ్మదిగా కథ ముతేశ్వరం అనే ఊరుకి చేరుతుంది. ఆ ఊరివారి దగ్గర సూర్య అనే పేరు తో వారు అతన్ని(బాలు) ని అక్కడ పిలుస్తూ ఉంటారు. వారంతా వరసలు పెట్టి కూడా బాలూ ని పిలవడం తో మెహరీన్ ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఆ ఊర్లో జాతరలో పాలుగొంటాడు , వారి కష్ట సుఖాలు చూస్తూ ఉంటాడు .. ఒక అనాథ ఇలా ఎలా ఒక ఫామిలీ ని సంపాదించుకోగలిగాడు అనేది ఆమెకి అస్సలు అర్ధం కాదు. ఈ మధ్యలో తనికెళ్ళ భరణి కారెక్టర్ ఎంటర్ అవుతుంది. తండ్రిగా పిలవబడతాడు. అసలు ఒక అనాథ కి తండ్రి ఎక్కడ నుంచి వచ్చాడు . ఆ ఊరి తో అతనికి సంబంధం ఏంటి … అటునుంచి వచ్చే ట్విస్ట్ ఏంటి , ఆ ట్విస్ట్ కారణం గా కథ ఏ మలుపు తిరుగుతుంది ఇవన్నీ తెరమీద చూడాల్సిందే..

ప్లస్ పాయింట్స్ 

తనికెళ్ళ భరణి – కల్యాణ్ రామ్ మధ్య సన్నివేశాలు చాలా చక్కగా రాసుకున్నారు. ఎమోషనల్ సీన్ లు కూడా బాగానే పండాయి. మొట్టమొదటి సారి ఫుల్ ఫామిలీ సినిమా చేసిన కల్యాణ్ రామ్ పెర్ఫార్మెంస్ తో అలరించాడు . ప్రతీ పాత్రా సినిమా కి హై లైట్ గా నిలుస్తాయి. ఫామిలీ ఎమోషన్ డీల్ చెయ్యడం లో సతీష్ మళ్ళీ తన పంథా చూపించే ప్రయత్నం చేశాడు. వెన్నెల కిశోర్ కామెడీ బాగుంది.

మైనస్ పాయింట్స్ 

సెకండ్ హాఫ్ డైరెక్టర్ కథ చెప్పిన విధానం పూర్తిగా సీరియల్స్ ని గుర్తు చేస్తుంది. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ లో కథనం చాలా వరకూ స్పీడ్ తగ్గిపోయింది . క్లైమాక్స్ చూడా చాలా పేలవంగా సాగింది. ఆఖర్లో విలన్ జైల్లోంచి బయటకి వచ్చి హీరో మీద యటాక్ చెయ్యడం ఫామిలీ కోసం హీరో త్యాగం – పోరాటం చెయ్యడం ఇవన్నీ చాలా రొటీన్ గా అనిపిస్తాయి. కామెడీ విషయం లో డైరెక్టర్ చాలా కష్టపడినా ఫలితం లేకుండా పోయింది .

సాంకేతిక విభాగం 

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేయలేకపోయారు . మంచి పాయింట్ అయితే ఉంది కానీ పాత్రలతో మంచి ఎమోషన్ అండ్ ఫన్ తో చిత్రాన్ని నడిపించే అవకాశం ఉన్నా కూడా దాన్ని ఉపయోగించుకోలేక పోయారు . సెకండ్ హాఫ్ లో రైటింగ్ అస్సలు బలేదు . సంగీత దర్శకుడు గోపీ సుందర్ సమకూర్చిన పాటలు, వాటి పిక్చరైజేషన్ కూడా అద్భుతంగా సినిమాలోని సన్నివేశాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ పనితనం కూడా బాగుంది. సినిమాలో నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

తీర్పు 

ఈ సంక్రాంతి ని టార్గెట్ చేసుకుని వచ్చిన అల వైకుంఠపురములో , సరిలేరు నీకేవ్వరూ సినిమాలు పాజిటివ్ రిజల్ట్ తో బయట పడ్డాయి. కొంతమంది బాలేదు అన్నా ఎక్కువ శాతం మంది బాగుంది అనే అంటున్నారు. కానీ కల్యాణ్ రామ్ మాత్రం ఈ సీజన్ ని సరిగ్గా వాడుకోలేకపోయాడు అనే చెప్పాలి. ఎంత మంచి వాడవురా సినిమా కి థియేటర్ లలో ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళిన ఆడియన్స్ కి సెకండ్ హాఫ్ లో సీరియల్ చూస్తున్న ఫీలింగ్ రావాడం చాలా ఇబ్బందికర అంశం. కామెడీ కోసం ప్రయత్నించిన డైరెక్టర్ చాలా చోట్ల ఫెయిల్ అయ్యాడు. కథ మాత్రం స్ట్రాంగ్ స్టోరీ తీసుకున్నాడు, దాన్ని ఆసక్తిగా మలచడం లో పూర్తిగా దెబ్బ తిన్నాడు. ఈ సంక్రాంతి కి మరీ ఖాళీగా ఉంటే ఒక్కసారి చూడచ్చు తప్ప , అంతా గొప్ప సినిమా ఏమీ కాదు .

Read more RELATED
Recommended to you

Latest news