ఆటోమేటిక్ గేర్ బాక్స్ లేదా మాన్యువ‌ల్‌.. రెండింటిలో ఏ త‌ర‌హా కార్లు బెట‌ర్ ?

-

టెక్నాల‌జీ మారుతున్న కొద్దీ వాహ‌నాల త‌యారీలోనూ అనేక మార్పులు వ‌స్తున్నాయి. ఎక్కువ పిక‌ప్‌ను, మైలేజీని అందించే వాహ‌నాల‌ను కంపెనీలు త‌యారు చేస్తున్నాయి. ముఖ్యంగా కార్ల విష‌యానికి వ‌స్తే ఎన్నో అద్బుత‌మైన ఫీచ‌ర్ల‌తో కంపెనీలు వాటిని త‌యారు చేసి అందిస్తున్నాయి. అయితే కార్ల‌లో ప్ర‌స్తుతం ఆటోమేటిక్ ఫీచ‌ర్ ఉన్న‌వాటికి డిమాండ్ ఎక్కువ‌గా ఉంది. అలాగని మాన్యువ‌ల్ కార్లేమీ త‌క్కువ కాదు. వాటినీ వాహ‌న‌దారులు కొనుగోలు చేస్తున్నారు. అందువ‌ల్ల ఈ రెండు ర‌కాల కార్లు ప్ర‌స్తుతం వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ రెండింటిలో ఏది మంచిది ? ఆటోమేటిక్ లేదా మాన్యువ‌ల్, ఏ కార్‌ను కొనుగోలు చేయాలి ? అని చాలా మంది ఆలోచిస్తుంటారు. మ‌రి ఆ రెండింటిలో ఏ కార్లు బాగుంటాయో ఇప్పుడు తెలుసుకుందామా..!

automatic or manual gear box which types of cars are better

ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉన్న కార్ల‌లో లాంగ్ జ‌ర్నీలు సుల‌భంగా చేయ‌వ‌చ్చు. చాలా సౌక‌ర్య‌వంతంగా ఉంటాయి. ఎక్కువసేపు న‌డిపిస్తారు క‌నుక గేర్ల‌ను మార్చే భారం తప్పుతుంది. సుల‌భంగా స్టీరింగ్‌ను కంట్రోల్ చేస్తూ బ్రేక్‌లు వేస్తూ వెళ్లిపోవ‌చ్చు. గేర్ల‌ను మాన్యువ‌ల్‌గా మార్చాల్సిన ప‌ని ఉండ‌దు. ఇక ఈ కార్లను ట్రాఫిక్‌లోనూ సుల‌భంగా న‌డ‌ప‌వ‌చ్చు. గుంత‌లు ఉన్న రోడ్ల మీద కూడా ఇవి సాఫీగా వెళ్లిపోతాయి. అందువ‌ల్ల ఆటోమేటిక్ కార్లు చాలా సౌక‌ర్య‌వంతంగా ఉంటాయ‌ని చెప్ప‌వ‌చ్చు.

ఇక మాన్యువ‌ల్ గేర్ బాక్స్ ఉన్న కార్ల‌కు ఆటోమేటిక్ కార్ల క‌న్నా మెయింటెనెన్స్ త‌క్కువ‌. మెయింటెనెన్స్ చేయించాల్సిన వ‌చ్చినా త‌క్కువ వ్య‌యం అవుతుంది. ఆటోమేటిక్ క‌న్నా మాన్యువ‌ల్ కార్లు త‌క్కువ ధ‌ర‌ను క‌లిగి ఉంటాయి. మాన్యువ‌ల్ కార్లు మైలేజీని ఎక్కువ ఇస్తాయి. కొండ ప్రాంతాల్లో మాన్యువ‌ల్ కార్ల‌తోనే సుల‌భంగా డ్రైవింగ్ చేయ‌వ‌చ్చు. ఎత్తుగా ఉన్న ప్రాంతాల‌కు మాన్యువ‌ల్ కార్లు సుల‌భంగా వెళ్తాయి.

అయితే రెండింటిలో ఏ కార్‌ను కొనుగోలు చేయాలి ? అంటే కొత్త‌గా కార్ ను న‌డిపించ‌డం నేర్చుకున్న వారికి ఆటోమేటిక్ కార్లు బాగా ప‌నిచేస్తాయి. అదే నైపుణ్యం ఉన్న‌వారు అయితే మాన్యువ‌ల్ కార్ల‌ను కొనుగోలు చేయ‌డ‌మే మంచిది. దీంతో ధ‌ర‌, మెయింటెనెన్స్ వ్య‌యం త‌గ్గుతాయి. కొండ ప్రాంతాల్లోనూ మాన్యువ‌ల్ కార్ల‌ను సుల‌భంగా న‌డిపించ‌వ‌చ్చు. అదే ఆటోమేటిక్ కార్లు అయితే కొండ ప్రాంతాల్లో ఇబ్బందులు క‌లుగుతాయి. క‌నుక రెండింటిలో మీకు ఏది మంచిగా అనిపిస్తుందో ఇక మీరే డిసైడ్ చేసుకోవాలి. అందుకు అనుగుణంగానే కార్‌ను కొనుగోలు చేయాలి..!

Read more RELATED
Recommended to you

Latest news