బడా ఖిలాడీ అతడు..గొప్పింటివారిని టార్గెట్ చేసి కోట్లు కాజేశాడు..

-

సాధారణంగా ఎవరైనా సరే గొప్పవారు కనబడితే వీళ్లతో మనకెందుకులే అని ఓ నమస్కారం చెప్పి వెళ్లిపోయేవారిని మనం చూసి ఉంటాం. కానీ, మనం తెలుసుకోబోయే ఈ ఖిలాడీ అలాంటి ఇలాంటి వాడు కాదండోయ్.. ఏకంగా పొలిటీషియన్స్, సినీ సెలబ్రిటీస్, బిజినెస్ మ్యాగ్నెట్స్‌నే టార్గెట్ చేస్తూ వారి దగ్గర నుంచి డబ్బులు కాజేయడం స్టార్ట్ చేశాడు. వారిని నమ్మించి మోసం చేయడంలో ఎక్స్‌పర్ట్ అయిపోయాడు. అలా ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను కూడా మోసం చేశాడు. తాజాగా పోలీసులు ఆ మోసగాడిని అరెస్ట్ చేశారు.

అతనెవరంటే.. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకి చెందిన సుకేశ్ చంద్రశేఖర్.. చూడటానికి నార్మల్ పర్సన్ లాగానే కనిపిస్తాడు. కానీ, ఇతను మహాముదురండోయ్.. పెద్దింటి వారిని, వారి భార్యలను టార్గెట్ చేసి వారి కష్టాలు తీరుస్తామని నమ్మ బలికి కోట్ల రూపాయలు దోచుకెళ్లాడు. దాదాపు రూ.200 కోట్లు దోపిడీ చేసినట్లు ఈడీ పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సుకేశ్ చంద్రశేఖర్ తాను పలుకుబడి కలిగిన వ్యక్తిని అని చెప్పి అందరినీ నమ్మిస్తాడని, ఈ క్రమంలోనే తనకు పెద్ద, పెద్ద నాయకులతో సంబంధాలున్నాయని చెప్పి వారి నమ్మకాన్ని వమ్ము జేస్తాడని పోలీసులు చెప్తున్నారు.

దోపిడీ చేసిన డబ్బుతో చెన్నైలో ఓ బంగ్లా కొన్నట్లు తెలుస్తోంది. చంద్రశేఖర్ హీరోయిన్ జాక్వెలిన్‌కు ఖరీదైన చాక్లెట్స్ గిఫ్ట్‌గా పంపి నమ్మించి మోసం చేసినట్లు ఈడీ వర్గాల ద్వారా తెలుస్తోంది. చంద్రశేఖర్, జాక్వెలిన్ మధ్య ఇరవైకి పైగా కాల్ రికార్డులు ఉన్నట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ కేసును ఢిల్లీ ఆర్థిక నేరాల నిరోధక విభాగం విచారిస్తున్నది. చంద్రశేఖర్‌పై 23 చీటింగ్ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నేరగాడైన సుకేశ్ చంద్రశేఖర్ 17 ఏళ్ల నుంచే మోసాలు చేయడానికి అలవాటు పడినట్లు పోలీసులు చెప్తున్నారు. చంద్రశేఖర్ ప్రస్తుతం చెన్నై పోలీసుల అదుపులో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news