విద్య, వైద్యంకే రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట : మంత్రి పొంగులేటి

-

కూసుమంచి పర్యటనలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక కామెంట్స్ చేసారు. ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేసాం అని పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యంకే పెద్దపీట వేసింది. విద్య, వైద్యంలో ప్రభుత్వ అనేక మార్పులు తీసుకొచ్చింది అని తెలిపారు.

అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో 637 కోట్ల రూపాయల తో మౌలిక వసతులు కల్పించింది. స్కూల్ తెరిచిన నాడే పుస్తకాలు,దుస్తులు ఇచ్చింది ప్రభుత్వం. ఎన్ని వేల కోట్ల ఖర్చైన వైద్యం విషయంలో వెనకడుగు వేసేది లేదు. రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద పది లక్షలు మాఫీ చేస్తుంది. భవిష్యత్ లో కళాశాల అభివృద్ధి కి కృషి చేస్తా అన్నారు. ఇక ఖమ్మం జిల్లాలో కూసుమంచి కాలేజీ అనే విధంగా తీర్చిదిద్దే విధంగా సిబ్బంది పని చేయాలి. కూసుమంచి కళాశాలను రాష్ట్రంలో నే టాప్ 3 కాలేజీల్లో ఉంచాలి అని కోరారు మంత్రి పొంగులేటి.

Read more RELATED
Recommended to you

Exit mobile version