న్యూయార్క్‌లో ఏలియన్స్? వీడియో హల్‌చల్

-

Blue Sky at Night Makes Social Media Light Up alians in new york city

ఏలియన్స్.. వీళ్ల గురించి ఎప్పుడూ చర్చే. అసలు ఏలియన్స్ ఉన్నారా? ఉంటే ఎక్కడుంటారు. ఏంటి వీళ్ల సంగతి అనేది ఏమీ తెలియదు కానీ… ఏలియన్స్‌పై మనుషులకు చాలా ఇంట్రెస్ట్. ఎంతలా అంటే.. న్యూయార్క్‌లో గురువారం రాత్రి ఆకాశంలోని కొంత బాగం ఒక్కసారిగా నీలం రంగులోకి మారిపోయింది. అంతే.. అదిగో.. ఏలియన్స్ వస్తున్నారు. వాళ్లు భూమ్మీదకు దిగుతున్నారు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ హడావుడి చేశారు. ఆకాశం నీలం రంగులోకి మారుతుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసి.. మరి ఆకాశం నీలి రంగులో ఎందుకు మారింది..అంటూ ప్రశ్నలు వేశారు.

చివరకు తేలిందేంటంటే.. ఏలియన్స్ కాదు.. గీలియన్స్ కాదు.. ఆకాశంలో నీలం రంగులో మెరుపు రావడానికి కారణం.. క్వీన్స్‌లో ఉన్న ఓ పవర్ ప్లాంటు పేలిపోవడం. అందుకే.. అలా ఆకాశంలో వెలుతురు వచ్చిందన్నమాట. న్యూయార్క్ పోలీసులు అసలు నిజం చెప్పేసరికి నెటిజన్లు ఒక్కసారిగా కామ్ అయిపోయారు. పవర్ ప్లాంట్‌లో పేలుడు వల్లే లాగార్డియా ఎయిర్‌పోర్ట్‌లో విద్యుత్‌కు అంతరాయం కలిగి పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. అది ఏలియన్స్ పుకారు వెనుక ఉన్న అసలు రహస్యం.

Read more RELATED
Recommended to you

Exit mobile version