సీనియర్ నటి, అతిలోక సుందరి శ్రీదేవి మరణించి అప్పుడే సంవత్సరం అయింది. ఫిబ్రవరి 24న తన ప్రథమ వర్థంతి. తన ప్రథమ వర్థంతి రోజున ఏదైనా మంచి పని చేయాలని ఆమె ఫ్యామిలీ నిర్ణయించుకుంది. ఆరోజు పలు సేవా కార్యక్రమాలకు వాళ్లు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే శ్రీదేవికి ఇష్టమైన చేతితో నేసిన కోటా చీరను ఆన్‌లైన్‌లో వేలానికి పెట్టారు. పరిసెర అనే ఆన్‌లైన్ హ్యాండీక్రాఫ్ట్ వెబ్‌సైట్‌లో ఆ చీరను వేలం వేశారు. ప్రారంభ ధరను 40 వేలుగా నిర్ణయించారు. ఇప్పటి వరకు బిడ్ 1,30,000 వరకు పోయింది. ఆమె ప్రథమ వర్థంతి రోజయిన ఫిబ్రవరి 24 వరకు ఆ చీరను వేలంలో ఉంచుతారు.
అప్పటి వరకు ఎవరైతే ఎక్కవ బిడ్ వేస్తారో వాళ్లకే ఆ చీర చెందుతుంది. ఆ చీర ద్వారా వచ్చి డబ్బును కన్సర్న్ ఇండియా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వాలని బోనీ కపూర్, ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కన్సర్న్ ఇండియా ఫౌండేషన్ అనే సంస్థ ఇప్పటి వరకు చాలా ప్రాజెక్టులను చేపట్టింది. చీర ద్వారా వచ్చిన డబ్బుతో కూడా అనేక సామాజిక కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఫౌండేషన్ తెలిపింది.
Parisera invites you to participate in the auction of Actress Sridevi’s handwoven Kota sari. Mr Boney Kapoor has chosen the 27-Year old Non-Profit organization Concern India Foundation to receive the proceeds from the auction. Bid Now https://t.co/4LPcmG8tQ7 pic.twitter.com/T33pk3WwPc
— Parisera.com (@parisera) February 20, 2019
Parisera invites you to participate in the auction of Actress Sridevi’s handwoven Kota sari. Mr Boney Kapoor has chosen the 27-Year old Non-Profit organization Concern India Foundation to receive the proceeds from the auction. https://t.co/WMI13FGsQy pic.twitter.com/WbLrOHEeT8
— Parisera.com (@parisera) February 20, 2019