ఫిబ్రవరి 23 శనివారం – రోజువారి రాశిఫలాలు
మేషరాశి : మిశ్రమ ఫలితాలు, సౌఖ్యం, బాకీలు వసూలు, బంధువుల రాక.అనవసర వివాదాలు, గొడవలు. పరిహారాలు నవగ్రహ ప్రదక్షణ, చాలీసా పారాయణం.
వృషభరాశి : అనుకూలమైన రోజు, పనలు పూర్తివుతాయి, అధికశ్రమ, విందులు. పరిహారాలు ఇష్టదేవతారాధన లేదా ఏదైనా మంచి పనిచేయండి దానం, ధర్మం.
మిథునరాశి : ప్రతికూలమైన రోజు, అన్నింటా ఆటంకాలు, పనుల్లో జాప్యం. వివాదాలు. పరిహారాలు సూర్యనమస్కారాలు, చాలీసా పారాయణం, శనివార నియమం పాటించండి.
కర్కాటకరాశి : ప్రతికూల ఫలితాలు, అధికశ్రమ,దురావార్తా శ్రవణం, దుఃఖం. పరిహారాలు వేంకటేశ్వరస్వామికి పూజ, గోసేవ, అన్నదానం ఏదో ఒకటి చేయండి.
సింహరాశి : అనుకూలమైన రోజు, మనఃశాంతి, ధనలాభం, చిన్నచిన్న సమస్యలు వచ్చినా అధిగమిస్తారు. పరిహారాలు ఆంజనేయస్వామి దండకం లేదా చాలీసా చదువుకోండి. సింధూర ధారణ చేయండి.
కన్యారాశి : మిశ్రమ ఫలితాలు, ధనలాభం, ఇంట్లోనివారికి అనారోగ్య సమస్యలు, శ్రమ అధికం, సోదర, సోదరి సహకారం. పరిహారాలు గణపతి ఆరాధన చేయండి లేదా స్తోత్ర పఠనం/శ్రవణం పనుల్లో ఆటంకాలు పోయి సజావుగా ఉంటుంది.
తులారాశి : ప్రతికూలం. విరోధాలు, పనుల్లో ఆటంకాలు, అనవసర ఖర్చు. పరిహారాలు వేంకటేశ్వర ఆరాధన లేదా గణపతి ఆరాధన చేసుకోండి మంచి జరుగుతుంది.
వృశ్చికరాశి : అనుకూలమైన రోజు, లాభం, శ్రమ, స్నేహితుల వల్ల లాభం. పరిహారాలు ఏదో ఒక మంచి పనిచేయండి. ఇష్టదేవాన్ని పూజించండి.
ధనస్సురాశి : ప్రతికూలమైన రోజు, అధికశ్రమ, అలసట, దుఃఖం, ఆటంకాలు. పరిహారాలు వేంకటేశ్వరస్వామి ఆరాధన, శనివార నియమం, గణపతి ఆరాధన చేయండి.
మకరరాశి : అనుకూల షలితాలు, ఆకస్మిక ధనలాభం, సుఖం, శ్రమ. పరిహారాలు విష్ణు సహస్రనామ పారాయణం. శనివార నియమం పాటించండి.
కుంభరాశి : మిశ్రమ ఫలితాలు, ఉత్సాహం, అకారణ విరోధాలు, చెడుపనుల్లో పాల్గొనుట. పరిహారాలు దేవనామస్మరణ, గణపతి ఆరాధన, నైతికత పాటించడం చేయండి.
మీనరాశి : అనుకూల ఫలితాలు, విందులు, మిత్రుల కలయిక, జయం, కార్యలాభం. పరిహారాలు ఏదో ఒక మంచి పనిచేయండి. ఇష్టదేవతాస్మరణ చేయండి.
నోట్: సూర్యనమస్కారాలు అంటే ప్రాతఃకాలమే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలతో సూర్యునికి ఎదురుగా నిలబడి 12 సార్లు ఓం నమో భాస్కరాయనమః వంటి సూర్యనామాలతో ప్రార్థన. శరీరానికి లేత సూర్యకిరణాలు తగిలేటట్లు కనీసం ఐదు నిమిషాలు నిలబడండి. గోసేవ/పేదవారికి సహాయం అంటే దగ్గర్లోని గోశాల లేదా మీ ఇంటికి దగ్గర్లో ఆవులు కన్పిస్తే ఏదో ఒక పండో, ఫలమో, దానానో వేసి పృష్ట భాగాన్ని నమస్కారం చేసుకోండి. అన్నదానం అంటే జీహెచ్‌ఎంసీ ఐదురూపాయల భోజనం దగ్గర పది రూ॥ నుంచి మీ స్థాయిని బట్టి ఎంతో కొంతతో పేదవారి ఆకలి తీర్చండి. ఈ చిన్న ఫలితాలు మీ జీవితానికి చాలా ఉపయోగపడుతాయి. మేలు చేస్తాయి. ఓం నమో వేంకటేశ్వరాయనమః
-కేశవ