ఒకేసారి రెండు వేర్వేరు రాష్ట్రాల్లో ఉండాలనేది చాలామందికి ఒక క్రేజీ డ్రీమ్ ఉంటుంది. అందుకో బోర్డర్స్ కు వెళ్లినప్పుడు భలే థ్రిల్లింగా ఫీల్ అవుతుంటారు. మరీ ఎప్పుడూ అలాంటి ప్రదేశంలోనే ఉంటే..ఇంట్లో ఉండే ఒక రూం ఒక దేశంలో మరో రూమ్ ఇంకో దేశంలో ఉంటే ఎలా ఉంటుంది. ఇళ్లమధ్యలోంచి సరిహద్దురేఖ వేశారట..ఎక్కడో ఎంటో చూసేద్దాం..
యూరప్ లోని బార్లే (Baarle) అనే గ్రామం రెండు దేశాల్లో ఉన్న సరిహద్దు మున్సిపాలిటీ. దీనికి ఓ పక్క బెల్జియం, మరో పక్క నెదర్లాండ్స్ ఉంటుంది. బార్లే గ్రామంలో, రోడ్లపై చాలా చోట్ల తెల్లటి ప్లస్ (+) గుర్తులు కనిపిస్తాయి. అవే సరిహద్దు రేఖ. ఇక్కడి ఓ రోడ్డుపై వంకరగా ఈ సరిహద్దు సాగుతోంది. ఆ పక్కనే ఉన్న కొన్ని ఇళ్లు, షాపులు, రెస్టారెంట్ల మధ్య నుంచి కూడా సరిహద్దు గీత వెళ్తుంది. సరిహద్దు వెంట భవనాలు, రెస్టారెంట్లు, కేఫ్ హౌసులు ఇలా చాలా ఉన్నాయి. వీటిలో కొన్ని బెల్జియంలో ఉంటే, కొన్ని నెదర్లాండ్స్ లో ఉన్నాయి. వీటిలో ఎంతో కొంత భాగం పక్క దేశంలో కూడా ఉంటుంది.
బెల్జియంవైపు ఉన్న సరిహద్దు ప్రాంతాన్ని బార్లే హెర్టాగ్ (Baarle-Hertog) అంటారు. నెదర్లాండ్స్ వైపు ఉన్న సరిహద్దు ప్రాంతాన్ని బార్లే నస్సావ్ (Baarle-Nassau) అంటారు. అందువల్ల ఇక్కడి ప్రజలు అటో ఇటో ఒకట్రెండు అడుగులు వేస్తే చాలు మరో దేశంలోకి వచ్చేసినట్లే. కొంత మంది రాత్రివేళ ఓ దేశంలో పడుకుంటారు. తెల్లారి లేచి చూస్తే మరో దేశంలో ఉంటారు. నిద్రలో దొర్లడం వల్ల అలా జరుగుతుంది.
బార్లేకి రెండు పేర్లు ఉన్నట్లే… ప్రతీదీ రెండేసి ఉంటాయి. అంటే రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. రెండు పోస్టాఫీసులు ఉన్నాయి. వీటన్నింటినీ ఒకటే కమిటీకి చెందిన వారు కంట్రోల్ చేస్తారట. ఈ కారణంగానే బార్లే ఎప్పుడూ టూరిస్టులను ఆకట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల నుంచి పర్యాటకులు ఈ ఊళ్లోకి వచ్చి… సరిహద్దులు దాటుతూ సెల్ఫీలు తీసుకుంటారు. ఇళ్ల మధ్య నుంచి వెళ్లిన బోర్డర్ ని చూసి ఆశ్యర్యానికి లోనవుతుంటారు..