11 ఏళ్ల బాలుడు తండ్రి మెయిల్‌ హ్యాక్‌చేసి రూ.10 కోట్ల డిమాండ్‌..!

-

ప్రస్తుతం కాలంలో సోషల్‌ మీడియాతో ఎంత ఉపయోగం ఉంటుందో.. అంతకు మించి అనార్థలు కూడా ఎదురవుతున్నాయి. సోషల్‌ మీడియాను మనం వాడే విధానమే ముఖ్యం అంటున్నారు. విశ్లేషకులు. గతంలో ఆన్‌లైన్‌ గేమ్‌లకు ఆకర్షితులై ప్రమాదాలు కొనితెచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ పదకొండేళ్ల బాలుడు యూట్యూబ్‌ వీడియోలు చూసి ఏకంగా తన తండ్రికే రూ. 10 కోట్ల ఎసరు పెట్టాడు.

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. యూట్యూబ్‌లో సైబర్‌ క్రై మ్‌ వీడియో చూసిన బాలుడు ఈ–మెయిల్‌ హ్యాక్‌ చేసి మీ వ్యక్తిగత వివరాలు, కుటుంబ సభ్యుల ఫొటోలు బహిరంగ పరుస్తానని బెదిరించాడు. రూ.పది కోట్లు ఇస్తేనే వదిలేస్తానని వార్నింగ్‌ సైతం ఇచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలో దిగి ఈ తతంగానికి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.

అదే ఇంట్లో నుంచి కాల్‌..

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని ఓ వ్యక్తి నూతన సంవత్సరం మొదటి రోజే అతడి∙ఈ–మెయిల్, çఇతరాత్ర వివరాలు హ్యాకయ్యాయని.. గుర్తు తెలియని వ్యక్తి తనకు ఫోన్‌ చేసి రూ.10 కోట్లు ఇవ్వాలని బెదిరింపులకు గురి చేస్తున్నారు. అడిగినంత ఇవ్వకపోతే మీ కుటుంబ వివరాలు, వ్యక్తిగత ఫొటోలు ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ చేస్తానని వార్నింగ్‌లపై వార్నింగ్‌లు ఇస్తూనే ఉన్నాడు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి పనిపట్టే పనిలో పడ్డారు. మొదటగా అసలు బెదిరింపులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అనే విషయాలపై ఆరా తీసి, ఐపీ అడ్రస్‌ పరిశీలించగా ఫిర్యాదు చేసిన వ్యక్తి ఇంటి నుంచే బెదిరింపు కాల్‌ రావడం చూసి పోలీసులు కంగుతున్నారు. దీంతో మరింత క్షుణ్నంగా వివరాలు సేకరించగా ఫిర్యాదు చేసిన వ్యక్తి కుమారుడే రూ.10 కోట్లు డిమాండ్‌ చేస్తున్నట్లు గుర్తించారు.

5వ తరగతిలోనే..

5వ చదువుతున్న 11 ఏళ్ల కుమారుడు యూట్యూబ్‌లో సైబర్‌ క్రై మ్‌ వీడియోలు చూసి తండ్రిపైనే అస్త్రాలు ప్రయోగించాడని పోలీసులు గుర్తించారు. హ్యాకింగ్‌ వీడియోలు, ఆన్‌లైన్‌ మోసాలకు సంబంధించిన వీడియోలు చూసి తాను నేర్చుకుని తానే తన తండ్రికి రూ. 10 కోట్లు డిమాండ్‌ చేసినట్లు పోలీసుల ముందు చెప్పాడం కుటుంబ సభ్యులను గందరగోళానికి గురి చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news