కర్పూరం హారతికి మాత్రమే కాదు ఈ సమస్యలకు దివ్య ఔషధంలా పనిచేస్తుంది

-

పూజగదిలో ఉండే కర్పూరం గురించి మనందరికి బాగా తెలుసు. హారతి ఇవ్వడానికి వాడే ఈ కర్పూరం అంటే..హిందువులకు ప్రత్యేకం. ఇంట్లోని వాస్తు దోషాలను, శారీరక సమస్యలన్నింటిని తొలగించే శక్తి కర్పూరంలో ఉంది. కర్పూరంలో ఉండే అసాధారణ గుణాల గురించి చాలామందికి తెలియదు. కర్పూరంలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. శరీరం, మనస్సు రెండింటినీ ఫిట్‌గా ఉంచడంలో సహాయపడతాయి. కర్పూరం ఎలా

కర్పూరం ఉపయోగాలు:

కర్పూరం కండరాల నొప్పిని తగ్గించడంలో పనిచేస్తుంది. ఆవనూనెలో కర్పూరం వేసి శరీరానికి క్రమం తప్పకుండా మసాజ్ చేస్తే..మంచి ఫలితం ఉంటుంది. దగ్గు విషయంలో కూడా ఈ నూనెని ఛాతీ, వెనుకకు మసాజ్ చేయాలి. చాలా విశ్రాంతి వస్తుంది. మీరు ఆవనూనెకు బదులుగా నువ్వుల నూనెను కూడా ఉపయోగించవచ్చు.

వేడి నీటిలో కర్పూరం వేసి ఆవిరి తీసుకోవడం వల్ల జలుబు నుంచి గొప్ప ఉపశమనం లభిస్తుంది.

చర్మంపై మచ్చలు ఉంటే కొబ్బరి నూనెలో కర్పూరాన్ని మిక్స్ చేసి చర్మానికి క్రమం తప్పకుండా రాసుకోవాలి. దీంతో చర్మంలోని మచ్చలు తొలగిపోయి చర్మం శుభ్రంగా మారుతుంది. కానీ జిడ్డు చర్మం వాళ్లు మాత్రం.. నిపుణులను సంప్రదించిన తర్వాత మాత్రమే చేయాలి.

కర్పూరాన్ని కొబ్బరినూనెలో కలిపి జుట్టుకు పట్టించడం వల్ల చుండ్రు సమస్యపోయి..జుట్టు నల్లగా మారుతుంది.

కర్పూర పరిమళం మనసుకు ప్రశాంతతనిస్తుంది. మీకు ఎక్కువ ఒత్తిడి ఉంటే కర్పూరాన్ని ఒక పాత్రలో ఉంచి గదిలో పెట్టండి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. నైట్ మంచి నిద్రపడుతుంది.

తలనొప్పి వస్తే కర్పూరం, శుంఠి, తెల్ల చందనం సమపాళ్లలో గ్రైండ్ చేసి నుదుటిపై రాసుకోవాలి. కాసేపు పడుకుంటే చాలు రిలాక్స్‌గా అనిపిస్తుంది.

పాదాల పగుళ్లను నివారించటంలో కూడా..కర్పూరం చాలా బాగా పనిచేస్తుంది.

కర్పూరం ఈ పద్ధతిలో వాడకూడదు..

కర్పూరం ఇంజెక్షన్ రూపంలో తీసుకోకూడదు. ఇంజెక్షన్ రూపంలో కర్పూరం వాడటం ఏమాత్రం మంచి పద్దతి కాదు.
అలాగే నోటి ద్వారా కర్పూరం తీసుకోకూడదు.
కర్పూరంను చర్మానికి అప్లై చేసి ఎక్కువ సమయం ఉంచుకోకూడదు. లేదంటే మరింత డ్యామేజ్ అవుతుంది.
గర్భిణీలు, పాలిచ్చే తల్లులు కర్పూరం వాడకూడదు. పిల్లలఆరోగ్యానికి హానికరం.
పిల్లలకు ఎక్కువ కర్పూరంను వాడకూడదు.

సరైన పద్దతిలో సరైన పరిమాణంలో వాడితే మీకు మంచి ఫలితాలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version