కత్తి అవసరం లేకుండా కొబ్బరి బోండాం తాగిన పంచవన్నెల చిలుక

-

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం కోడిచెర్ల గ్రామంలోని చెన్నారెడ్డి అనే ఓ రైతు పొలంలోని ఓ చెట్టుపై పంచవన్నెల చిలుక సందడి చేసింది. బాగా దాహమేసిందో ఏమో… పచ్చని కొబ్బరి చెట్టుమీద నుంచి ఓ కొబ్బరి బోండం కోసింది. పొడవాటి ముక్కుతో దానిని తొలిచి… మొత్తం కొబ్బరి నీళ్లన్నీ తాగేసింది.విషయాన్ని గుర్తించిన రైతు ఆ దృశ్యాలను వీడియో తీశాడు. మునుషుల అలికిడి కావడం, కొబ్బరి బోండాం తాగడం అయిపోవడం వల్ల ఖాళీ కొబ్బరి బోండాన్ని ముక్కుతో కరుచుకొని తుర్రుమని వెళ్లిపోయింది.

ఇలాంటి చిత్రాలు అరుదుగా మనిషి కంటికి కనిపిస్తాయి.. కానీ ఇవి అన్ని సృష్టిలో సర్వ సాధారణంగా జరిగే ప్రక్రియలు… మానవుని జీవన విధానాలలో యాంత్రిక మార్పు రావడం వలన అనేక జీవరాశులు వాటి మనుగడ ప్రశ్నార్థకం గా మారిపోయింది. పర్యావరణ మార్పులు ఎన్నో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news