స్టేజ్ మీద లైవ్ లోనే చనిపోయిన నటుడు.. కాపాడండి అని అరుస్తుంటే.. నాటకంలో భాగం అనుకున్న ప్రేక్షకులు

నటులకు మేకప్ కేవలం అందం మాత్రమే కాదు..అది వారి గర్వానికి, గౌరవానికి చిహ్నం లాంటిది. మేకప్ ఉన్నప్పుడే చనిపోవాలని చాలా మంది నటులు అనుకుంటారు. ఎందుకంటే ఆ వృత్తిమీదే ఆధారపడిన వాళ్లు..అదే పనిలో ఉన్నప్పుడు ప్రాణాలు పోవటం చాలా గొప్పగా భావిస్తారట. సరిగ్గా ఇలానే జరిగింది. స్టేజ్ పైనే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ప్రాణాలు పోతున్నాయ్..కాపాడండి అంటూ అరుస్తున్నా అదంతా యాక్టింగ్ లో భాగమే అనుకుని ప్రేక్షకులు చూస్తూ ఉండిపోయారట..రష్యాలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
DEATH ON STAGE Horror moment stage actor
 రష్యాలోని ఫేమస్ బోల్సోయ్ ధియేటర్‌లో ఓ స్టేజీ మీద ఓ నాటకం వేస్తున్నారు. నాటకం రసవత్తరంగా సాగుతోంది. చాలా మంది ఈ నాటకం చూసేందుకు వచ్చారు. ఈ క్రమంలో ఓ సీన్ అయిపోయిన తర్వాత నెక్ట్స్ సీన్ కోసం అందులో ఉండే నటులు స్టేజీ వెనుక కొన్ని మార్పులు చేస్తున్నారు.
స్టేజీ మీద బ్యాక్ గ్రౌండ్ మార్చే క్రమంలో 38 సంవత్సరాల కుల్లేష్ అనే నటుడు వారికి సాయం చేస్తున్నాడు. అయితే, ఆ సమయంలో ఇనుప గేటు లాంటిదాని కింద తను పడిపోయాడు. ధియేటర్లో కూర్చుని చూస్తున్న జనం అంతా కూడా ఇదేదో నాటకంలో భాగం అనుకున్నారు. అయితే, అతడు దాని కింద పడిపోయిన విషయాన్ని గమనించిన స్టేజీ మీద వ్యక్తులు వెంటనే పెద్దగా అరవడంతో స్టేజీ తెరలు మూసేశారు.
ధియేటర్ మేనేజ్‌మెంట్ వెంటనే ఆంబులెన్స్ తీసుకొచ్చి అతడిని ఆస్పత్రికి తరలించింది. కానీ తను అప్పటికే చనిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా కొన్ని బయటకు వచ్చాయి. అతడు కింద పడి అరుస్తుంటే జనం అదేదో కామెడీ అనుకున్నారు ప్రేక్షకులు .
 ఘటన జరిగిన వెంటనే ధియేటర్ యాజమాన్యం అలర్ట్ ప్రకటించింది. అందరూ జాగ్రత్తగా బయటకు వెళ్లాలని సూచించింది. ప్రేక్షకులకు అప్పుడు అర్థమైంది..తను నిజంగానే అరుస్తున్నాడని..భయంతో బయటకి పరుగులు తీశారు.
– Triveni Naidu