దీప్‌వీర్ ఒక్కటయ్యారు…!

-

ఎట్టకేలకు బాలీవుడ్ ప్రేమ జంట ఒక్కటయ్యారు. దీపికా పదుకొనె, రణ్‌వీర్ సింగ్ పెళ్లి చేసుకున్నారు. ఇటలీలోని లేక్ కోమోలో వీళ్ల పెళ్లి ఇవాళ కొంకణి సంప్రదాయంలో జరిగింది. ఇక.. పెళ్లి దుస్తుల్లో దీపిక, రణ్‌వీర్ ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రేపు సింధి సంప్రదాయంలో మరోసారి వీళ్ల పెళ్లి తంతు జరగనుంది. అనంతరం ఈనెల 21న బెంగళూరు, 28న ముంబైలో వాళ్ల పెళ్లి రిసెప్షన్ జరగనుంది. ఇక.. లేక్ కోమోలో ఇవాళ జరిగిన పెళ్లికి చాలా తక్కువ మంది అతిథులు హాజరయినట్టు సమాచారం. దీపిక తన పెళ్లిలో ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి డిజైన్ చేసిన చీరను కట్టుకున్నదట. చూద్దాం. మరి.. రేపు సింధి సంప్రదాయంలో జరగబోయే పెళ్లికి ఇంకెంత హడావుడి ఉండనుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version